News August 18, 2025

DEECET స్పాట్ అడ్మిషన్స్.. ఈ నెల 21వ తేదీ లాస్ట్

image

ఉమ్మడి MBNR జిల్లాలో DEECET-2025లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు మహమ్మద్ మేరాజుల్లాఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా DEECETలో అర్హత సాధించి ఉండాలని, అలాగే ఏ కళాశాలలోనూ సీటు పొంది ఉండకూడదన్నారు. అడ్మిషన్ల గడువు ఈ నెల 21 అని ఆయన తెలిపారు.

Similar News

News August 18, 2025

సంగారెడ్డి: పర్యావరణ పోటీలకు దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నేషనల్ స్టూడెంట్ పర్యావరణ పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈనెల 21 వరకు https://ecomitram.app/nspc/school వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ఇతర వివరాలకు జిల్లా ఎన్జీసీ కో ఆర్డినేటర్ మాధవ రెడ్డి 94400 69750 నంబరును సంప్రదించాలని సూచించారు.

News August 18, 2025

పెంచికల్‌పేట్ మండలంలో చిరుత సంచారం

image

పెంచికలపేట్ మండలంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు FRO అనిల్ కుమార్ తెలిపారు. రేంజ్ పరిధిలోని చేడువాయి, దరోగపల్లి, పోతపల్లి, బొంబాయిగూడ, సారసాలతో పాటు అటవీ సమీప ప్రాంతాలలో చిరుత పులి సంచరిస్తుందన్నారు. పంట చేన్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ చుట్టుపక్కలా చూసుకుంటూ, గుంపులుగా వెళ్లాలన్నారు. చిరుతపులి కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు తెలుపాలని సూచించారు.

News August 18, 2025

మాధవ్ కౌశిక్ ఊచకోత.. 31 బంతుల్లోనే 95*

image

యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావరిక్స్ బ్యాటర్ మాధవ్ కౌశిక్ అరాచకం సృష్టించారు. కాన్పూర్ సూపర్‌స్టార్స్‌తో జరిగిన మ్యాచులో మాధవ్ 31 బంతుల్లోనే 95* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అతడి ఇన్నింగ్సులో 10 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. మాధవ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 300పైన ఉండటం విశేషం. అతడి దూకుడుతో మీరట్ ఓవర్లన్నీ ఆడి 225/2 పరుగులు చేసింది. ఛేదనలో కాన్పూర్ 20 ఓవర్లలో 139/9 పరుగులకే పరిమితమైంది.