News September 21, 2024

శ్రీవారి దర్శనంతో దీక్ష ముగిస్తా: పవన్ కళ్యాణ్

image

AP: వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు కళంకం తెచ్చే విధంగా గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించిందని పవన్ ట్వీట్ చేశారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని పేర్కొన్నారు. శ్రీవారిని దర్శించుకొని <<14161291>>దీక్ష<<>> ముగించి గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని కోరుతానని తెలిపారు.

Similar News

News November 14, 2025

టాస్ ప్రాక్టీస్ చేస్తున్న సౌతాఫ్రికా కెప్టెన్.. కారణమిదే!

image

కోల్‌కతాలో రేపు సౌతాఫ్రికా-ఇండియా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రొటీస్ కెప్టెన్ బవుమా ఓ సరదా విషయాన్ని పంచుకున్నారు. ‘ఇటీవల కేన్ విలియమ్సన్‌ను కలిశా. భారత్‌ను ఓడించేందుకు కొన్ని పాయింట్స్ అడిగా. కేన్ పెద్దగా ఓపెన్ కాలేదు. కానీ టాస్ గెలవాలని చెప్పాడు. దీంతో అప్పటి నుంచి కాయిన్ టాస్ వేయడం ప్రాక్టీస్ చేస్తున్నా’ అని చెప్పారు. తాము సిరీస్ కోసం బాగానే సిద్ధమయ్యామని అనుకుంటున్నానని తెలిపారు.

News November 14, 2025

కౌంటింగ్‌లో కుట్రకు ప్లాన్: తేజస్వీ

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నెమ్మదింపజేసేందుకు రేపు కుట్ర జరుగుతుందని RJD నేత తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. మహాగఠ్‌బంధన్‌ అభ్యర్థులు గెలిస్తే ప్రకటించవద్దని, తొలుత ఎన్డీయే అభ్యర్థుల గెలుపునే ప్రకటించాలని అధికారులకు చెప్పారని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఫోన్లు చేశారని తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. క్లియర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News November 14, 2025

గొంతులో మటన్ ముక్క.. ఊపిరాడక వ్యక్తి మృతి

image

TG: నాగర్ కర్నూల్ జిల్లాలోని బొందలపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. నిన్న రాత్రి తాపీ మేస్త్రీలకు ఓ ఇంటి యజమాని దావత్ (విందు) ఏర్పాటు చేశారు. అక్కడ మటన్ తింటుండగా లక్ష్మయ్య (65) గొంతులో ముక్క ఇరుక్కుపోయింది. దీంతో ఆయన శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి.