News November 26, 2024
స్కిల్ డెవలప్మెంట్ కోసం డీప్ టెక్నాలజీ: చంద్రబాబు
AP: 2029 నాటికి రాష్ట్రంలో 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో నైపుణ్యాభివృద్ధి కోసం డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మిస్తామని చెప్పారు. ‘స్టార్టప్‌లకు రూ.25 లక్షల సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అలాగే యూత్‌లో స్కిల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాం. మరిన్ని ఐటీ పాలసీలపై చర్చిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 26, 2024
మీకు PAN కార్డు ఉందా..? అయితే ఇది తెలుసుకోండి
PAN 2.0 త్వరలో ప్రారంభం అవుతుండడంతో ప్రస్తుతం పాన్ కార్డు ఉన్న వారు పాత కార్డులను మార్చుకోవాల్సిన అవసరం లేదని CBDT ప్రకటించింది. ఒకవేళ పాన్ కార్డులోని వివరాలను మార్చుకోవాలనుకుంటే PAN 2.0 ప్రాజెక్టు ప్రారంభమయ్యాక ఉచితంగా మార్చుకోవచ్చని తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా PAN/TAN సేవలు అప్‌గ్రేడెడ్ డిజిటలైజేషన్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయగలిగేలా ఒకే పోర్టల్‌లో అందుబాటులోకొస్తాయి.
News November 26, 2024
రఘురామకృష్ణరాజు కేసు.. విజయ్‌పాల్ అరెస్ట్
AP: మాజీ MP, ప్రస్తుత Dy స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసుకు సంబంధించి సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్‌ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి పాల్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో విజయ్ పాల్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.
News November 26, 2024
బాపూ ఘాట్ అభివృద్ధికి సహకరించండి: సీఎం
HYD లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ను CM రేవంత్ విజ్ఞప్తి చేశారు. ‘గాంధీ చితాభస్మాన్ని కలిపిన చోటును ప్రపంచస్థాయిలో తాత్వికతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఇక్కడ గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, శాంతి విగ్రహం ఏర్పాటు చేసేందుకు రక్షణ శాఖకు చెందిన 222.27 ఎకరాలను బదిలీ చేయండి’ అని CM కోరారు.