News October 10, 2024
పాక్ కెప్టెన్ ఇంట్లో తీవ్ర విషాదం

పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమె హుటాహుటిన దుబాయ్ నుంచి కరాచీ బయల్దేరి వెళ్లారు. ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్కు వైస్ కెప్టెన్ మునీబా అలీ సారథిగా వ్యవహరిస్తారు. కాగా మహిళల టీ20 వరల్డ్ కప్లో ఫాతిమా సారథ్యంలో పాక్ ఒక మ్యాచ్ గెలిచి, మరొకటి ఓడింది.
Similar News
News January 16, 2026
ఇరాన్ వీధుల్లో అద్దె సైనికులు

ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలను అణిచివేయడానికి ఖమేనీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయ భద్రతా బలగాలపై నమ్మకం తగ్గడంతో ఇరాక్ నుంచి కిరాయికి యువకులను రప్పించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యాత్రికుల ముసుగులో వీరంతా ఇరాన్లోకి చొరబడుతున్నారని, అనంతరం నిరసనకారులపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హెజ్బొల్లా గ్రూప్ వంటి వారు ఇందులో ఉన్నట్లు సమాచారం.
News January 16, 2026
NTPCలో ఉద్యోగాలు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 16, 2026
కనుమ రోజు మినుము ఎందుకు తినాలి?

కనుమ పశువులకు, పితృదేవతలకు అంకితం చేసిన పండుగ. ఈరోజు చనిపోయిన పెద్దల కోసం పెట్టే ప్రసాదాల్లో గారెలు ప్రధానమైనవి. వీటిలో పోషకాల విలువలు ఎక్కువ. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, బలాన్ని అందించడంలో మినుములు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ‘కనుమ రోజు మినుము తినాలి’ అనే సామెత పుట్టింది. ఆ రోజు అల్లుళ్లు, బంధువులతో కలిసి మినుములతో చేసిన వంటకాలు తింటూ, విశ్రాంతిగా గడపడమే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు రహస్యం.


