News February 14, 2025
నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాహుల్ తన SM ఖాతాలో షేర్ చేశారు. ‘నాన్న లేని లోటు పూడ్చలేనిది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటా. థాంక్యూ నాన్నా’ అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా రాహుల్ పలు తెలుగు సినిమాల్లో నటించడంతో పాటు డైరెక్ట్ చేశారు. సింగర్ చిన్మయి శ్రీపాదను ఆయన పెళ్లాడారు.
Similar News
News November 18, 2025
అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ అరెస్ట్

హరియాణా ఫరిదాబాద్లోని అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని మనీలాండరింగ్ కేసులో ED అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు, టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న వర్సిటీ సహా 25 ప్రాంతాల్లో ED సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. ఈక్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంది. కాగా వర్సిటీలో పనిచేసిన ముగ్గురు డాక్టర్లకు ఉగ్ర కుట్రతో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ జరుగుతోంది.
News November 18, 2025
తరాలకు మార్గదర్శకంగా సత్యసాయి బాబా జీవితం: మోదీ

AP: రేపు పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నానని పీఎం మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం సత్యసాయి జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. సత్యసాయి బాబాతో సంభాషించడానికి ఆయన నుంచి నేర్చుకోవడానికి కొన్ని అవకాశాలు తనకు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే సచిన్ పుట్టపర్తికి చేరుకున్నారు.
News November 18, 2025
మోక్షాన్ని పొందడమే మన ధర్మం

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ ||
ఏ దేవుడు పరమతేజమో, ఏ దేవుడు గొప్ప తపమో, ఏ దేవుడు మహత్తరమైన పరబ్రహ్మమో, ఏ దేవుడు పరాయణమో అతడొక్కడే సర్వభూతములకు పొందదగిన స్థానము. ఆ పరాయణమ్ ఈ సృష్టిలోని సకల ప్రాణులకూ చేరుకోవాల్సిన శాశ్వతమైన గమ్యం. ఆ నిత్య తత్వాన్ని ఆరాధించి, మోక్షాన్ని పొందడమే మన ధర్మం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


