News August 19, 2024
తీవ్ర విషాదం.. రాఖీ కట్టి చనిపోయింది

TG: సోదరులకు రాఖీ కట్టి ఓ సోదరి తుదిశ్వాస విడిచిన విషాద ఘటన మహబూబాబాద్(D) నర్సింహులపేట(మ)లో జరిగింది. కోదాడలో డిప్లొమా చదువుతున్న ఆమె(17)ను ప్రేమ పేరుతో ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో MHBDలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనంటూ శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల్లోనే తుదిశ్వాస విడిచింది.
Similar News
News January 29, 2026
ఏ దేవుళ్లకు ఏయే పుష్పాలు సమర్పించాలంటే?

విష్ణువుకు తులసి దళాలు ప్రీతికరం. మహాలక్ష్మికి తామరలు, ఎర్రని పూలు ఎంతో ఇష్టం. శివుడిని మారేడు దళాలతో పూజించాలి. సూర్యుడు, గణపతిని తెల్లజిల్లేడు పూలతో పూజిస్తే మంచి జరుగుతుంది. గాయత్రీ దేవికి మల్లె, మందార, కదంబ పుష్పాలు ఇష్టం. పూజకు వాడే పూలు తాజాగా, శుచిగా ఉండాలి. వాసన చూసినవి లేదా నేల రాలినవి వాడకూడదు. ఇలా ఇష్టమైన పూలతో దైవాన్ని అర్చిస్తే కోరిన కోరికలు నెరవేరి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
News January 29, 2026
‘బంగారంతో బీ కేర్‌ఫుల్’ వార్తల్లో నిజం లేదు: సజ్జనార్

TG: బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని SMలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని CP సజ్జనార్ తెలిపారు. అలాంటి పోస్టులను షేర్ చేయొద్దని సూచించారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ పూర్తిగా సురక్షితమని హామీ ఇచ్చారు. అనుమానం వస్తే 100కు కాల్ చేసి శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు.
News January 29, 2026
విజయ్ బూస్ట్ మాకు అవసరం లేదు: తమిళనాడు కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తామంటూ TVK అధినేత విజయ్ తండ్రి SA చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు పీసీసీ చీఫ్ సెల్వపెరుంతగై సెటైర్లు వేశారు. ‘విజయ్ నుంచి మాకు బూస్ట్ అవసరం లేదు. మా క్యాడర్‌ను చూడండి. వారు ఇప్పటికే బూస్ట్‌తో ఉన్నారు. మా నేత రాహుల్ గాంధీ అవసరమైన బూస్ట్, హార్లిక్స్, బోర్న్‌వీటా ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. చంద్రశేఖర్ కామెంట్లపై విజయ్, TVK ఇంకా స్పందించలేదు.


