News March 25, 2025
దీపక్ హుడాకు అబ్బాయిలంటే ఇష్టం: స్వీటీ

కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాపై ఆయన భార్య స్వీటీ బూరా సంచలన ఆరోపణలు చేశారు. హుడాకు అబ్బాయిలంటే ఆసక్తి అని చెప్పారు. తాను విడాకులు ఇవ్వమని కోరుతున్నానని, ఎలాంటి ఆస్తిని అడగట్లేదని పేర్కొన్నారు. దీపక్ తనను దారుణంగా వేధించడమే కాకుండా చెడుగా చిత్రీకరిస్తున్నాడని తెలిపారు. కాగా దీపక్ తనను వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులకు <<15878772>>ఫిర్యాదు చేసిన<<>> సంగతి తెలిసిందే.
Similar News
News November 14, 2025
దుల్కర్ ‘కాంత’ మూవీ పబ్లిక్ టాక్

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీబోర్సే జంటగా నటించిన ‘కాంత’ మూవీ ప్రీమియర్లు నిన్న పడ్డాయి. సినిమా థ్రిల్‌కు గురి చేస్తుందని మూవీ చూసినవారు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దుల్కర్, భాగ్యశ్రీ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. విజువల్స్ బాగున్నాయని చెబుతున్నారు. అయితే సెకండాఫ్ కాస్త స్లోగా, బోరింగ్‌గా ఉందని మరికొందరు అంటున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ.
News November 14, 2025
308 అప్రెంటిస్‌లు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 308 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు 300 ఉండగా.. వొకేషనల్ అప్రెంటిస్‌లు 8 ఉన్నాయి. అభ్యర్థుల వయసు కనీసం 18ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, విద్యార్హతలో మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://cochinshipyard.in/
News November 14, 2025
ఎలాంటి పాడి పశువులతో డెయిరీ ఫామ్ ప్రారంభించాలి?

గేదె పాలుకు ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉంటే గేదెలతో, ఆవు పాలకు ఎక్కువ డిమాండ్ ఉంటే సంకర జాతి ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించాలి. పాల సేకరణ కేంద్రాలు ఉండే ప్రాంతాలలో సంకర జాతి ఆవులు లేక ముర్రా జాతి గేదెలతో ఫారాన్ని ప్రారంభించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పచ్చిమేత వనరులు, మంచి యాజమాన్యం ఉంటే హోలిస్టీన్ ఫ్రీజియన్ సంకర జాతి ఆవులతో, సాధారణమైన మేత వనరులుంటే జెర్సీ సంకర జాతి ఆవులతో ఫామ్ ప్రారంభించాలి.


