News September 8, 2024

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె

image

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి అయ్యారు. ఇవాళ ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిన్న ముంబైలోని సిద్ది వినాయక ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఈమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, ఇవాళ డెలివరీ అయ్యారు. రణ్‌వీర్ సింగ్-దీపికా 2018 నవంబర్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే

Similar News

News February 19, 2026

NLG: బాధితుడికి అండగా నిలిచిన కలెక్టర్

image

నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ తన ఉదారతను చాటుకున్నారు. కొండమల్లేపల్లి పర్యటన నుంచి తిరిగి వస్తుండగా ధర్వేశిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన ఆయన, వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడైన పరశురామ్‌ను పరామర్శించారు. స్వయంగా అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని ఆసుపత్రికి పంపే వరకు అక్కడే ఉండి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కలెక్టర్ సమయస్ఫూర్తిని స్థానికులు కొనియాడుతున్నారు.

News February 19, 2026

ఆ 2 హామీల అమలుపై ఖర్గే, రాహుల్ ఆరా

image

TG: AICC నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ ఢిల్లీలో ఇవాళ రాష్ట్ర ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. మ్యానిఫెస్టోలోని వృద్ధాప్య పెన్షన్ ₹4000కు పెంపు, మహిళలకు ₹2500 ఆర్థిక సాయం అమలుపై వారు ఆరా తీశారు. పథకాలపై సమీక్షలో వీటిపై అడగగా రాష్ట్ర ఆర్థిక స్థితి, అమలుకు సవాళ్ల గురించి CM రేవంత్ వారికి వివరించారు. బడ్జెట్లో ఈ పథకాలకు నిధుల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం వివరించినట్లు పార్టీవర్గాలు పేర్కొన్నాయి.

News February 19, 2026

బాలికకు ఫ్లయింగ్ కిస్.. నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష

image

ఫ్లయింగ్ కిస్‌లు ఇవ్వడమూ లైంగిక వేధింపులేనని ముంబై స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది. తొమ్మిదేళ్ల కిందట 16 ఏళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష, ₹3K ఫైన్ విధించింది. 2017లో ఓ ఈవెంట్‌లో 19 ఏళ్ల యువకుడు బాలికకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ట్యూషన్‌కు వెళ్తుంటే వెనక నుంచి పట్టుకొని తన వైపునకు లాగాడు. దీంతో బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదవగా తాజాగా తీర్పు వెలువడింది.