News June 18, 2024
రెమ్యునరేషన్లో దీపికా పదుకొణె నంబర్-1

అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా దీపికా పదుకొణె అగ్రస్థానంలో నిలిచారు. ఆమె ఒక్కో సినిమాకు ₹15-30 కోట్లు తీసుకుంటున్నట్లు IMDB-ఫోర్బ్స్ డేటా వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో కంగనా(₹15-27cr), ప్రియాంకా చోప్రా(₹15-25cr), కత్రినా(₹15-25cr), అలియా(₹10-20cr), కరీనా(₹8-18cr), శ్రద్ధా కపూర్(₹7-15cr), విద్యాబాలన్(₹8-14cr), అనుష్క శర్మ(₹8-12cr), ఐశ్వర్యారాయ్(₹8-10cr) ఉన్నారని పేర్కొంది.
Similar News
News November 28, 2025
HYD: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన సామన్లు సర్దుకున్నట్లు టాక్. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.
News November 28, 2025
తులసి ఆకులను నమలకూడదా?

తులసి ఔషధ గుణాలు కలిగిన మొక్కగా గుర్తింపు పొందింది. అయితే ఈ మొక్క ఆకులను నమలకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. తులసి ఆకుల్లో ఆర్సెనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది పంటిపై ఉన్న ఎనామెల్ను దెబ్బతీస్తుంది. ఫలితంగా పళ్ల రంగు మారవచ్చు. అయితే ఆకులను నమలకుండా మింగితే ఎన్నో రోగాలు నయమవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. జలుబు, దగ్గుతో పోరాడి తులసి క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.
News November 28, 2025
ఆ దేశాల నుంచి ఎవరినీ రానివ్వం: ట్రంప్

థర్డ్ వరల్డ్ కంట్రీస్(అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని) నుంచి శాశ్వతంగా మైగ్రేషన్ నిలుపుదల చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ‘US సిస్టమ్ పూర్తిగా కోలుకునేందుకు ఇది తప్పనిసరి. బైడెన్ హయాంలో వచ్చిన అందరు అక్రమ వలసదారులను, దేశానికి ఉపయోగపడని వారిని, నేరాలు చేసిన వారిని పంపేయాలి. నాన్ సిటిజన్స్కు సబ్సిడీలు, ఫెడరల్ బెనిఫిట్స్ రద్దు చేయాలి’ అని తెలిపారు.


