News January 10, 2025

90 గంటల పని వ్యాఖ్యలు.. షాకింగ్‌గా ఉందన్న దీపిక

image

వారానికి 90 గంటలు, ఆదివారాలు కూడా పనిచేయాలన్న L&T ఛైర్మ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ <<15106710>>వ్యాఖ్యలపై<<>> హీరోయిన్ దీపికా పదుకొణే స్పందించారు. ‘సీనియర్ పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ప్రకటనలు చేయడం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు. #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల మధ్య మానసిక ఆరోగ్యం ముఖ్యమని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు.

Similar News

News December 16, 2025

‘అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా?

image

‘అఖండ-2’లో బాలకృష్ణ కూతురిగా నటించిన హర్షాలీ మల్హోత్రా గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. సినిమాలో ఆమె ఐక్యూ 226, 17 ఏళ్లకే DRDO సైంటిస్ట్ అని చూపించడంతో మీమ్స్ వస్తున్నాయి. ముంబైలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి నాలుగేళ్లకే సీరియళ్లలో, ఏడేళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ మూవీలో నటించి మెప్పించారు. 2017 తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. 8 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

News December 16, 2025

హాట్ మెటల్ ఉత్పత్తిలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ రికార్డ్

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం 6AM నుంచి సోమవారం 6AM వరకు బ్లాస్ట్‌ఫర్నేస్ 1, 2, 3 విభాగాల్లో 21,012 టన్నుల హాట్‌మెటల్ ఉత్పత్తి జరిగింది. ఒక రోజులో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఈ ఏడాది NOV 30న 20,440 టన్నుల ఉత్పత్తి జరిగింది. సంస్థ అభివృద్ధి పట్ల తమకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని ఉద్యోగ, కార్మిక వర్గాలు తెలిపాయి. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి.

News December 16, 2025

బాలికల స్కూల్ డ్రాపౌట్స్‌.. UPలో ఎక్కువ, TGలో తక్కువ!

image

దేశంలో బాలికల స్కూల్ డ్రాపౌట్స్ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం UP(57%) అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. అత్యల్పంగా తెలంగాణలో 31.1% డ్రాపౌట్స్ అయినట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా గత నాలుగేళ్లలో 84.9 లక్షల మంది చదువును మధ్యలోనే ఆపేశారని, అందులో సగం కంటే ఎక్కువ బాలికలే ఉన్నారని పేర్కొంది. ఐదేళ్లలో 26.46 లక్షల మందిని తిరిగి స్కూళ్లలో చేర్పించినట్లు ప్రకటించింది.