News April 8, 2025

షారుఖ్ మూవీలో తల్లి పాత్రలో దీపికా!

image

బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’లో దీపికా పదుకొణె అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె సుహానా ఖాన్ తల్లిగా, షారుఖ్ మాజీ ప్రేయసిగా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కథలో ప్రధాన సంఘర్షణలకు ఈ పాత్ర కేంద్రంగా ఉంటుందని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ‘పఠాన్’ రూ.1050 కోట్లు వసూలు చేసింది.

Similar News

News April 17, 2025

హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

image

TG: హైదరాబాద్‌లో 26 శాతం ఇళ్ల అమ్మకాలు పడిపోయినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ తెలిపింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 10,647 యూనిట్ల హౌస్ సేల్స్ జరిగినట్లు వెల్లడించింది. అదే గతేడాది ఇదే వ్యవధిలో 14,298 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. బెంగళూరులో 13 శాతం, చెన్నైలో 8 శాతం సేల్స్ పెరిగినట్లు వివరించింది.

News April 17, 2025

నేటి నుంచి ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు

image

TG: ‘భూభారతి’ పైలెట్ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. అక్కడ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు దరఖాస్తులు స్వీకరించి, వాటిని పోర్టల్ ద్వారా పరిష్కరిస్తారు. అందులో పరిష్కారం కాకున్నా, పోర్టల్ పని చేయకపోయినా రాష్ట్రస్థాయిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈ సదస్సులను మంత్రి పొంగులేటి ఇవాళ నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రారంభించనున్నారు.

News April 17, 2025

ఫెయిలైన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు

image

AP: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో చదువుతూ ఇంటర్ ఫెయిలైన, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. ఇందుకోసం కేజీబీవీ హాస్టళ్లను ఉపయోగించుకోవాలని భావించింది. కాగా ఆదర్శ పాఠశాలల్లో ఫస్టియర్‌లో 44%, సెకండ్ ఇయర్‌లో 18% శాతం మంది ఫెయిలయ్యారు.

error: Content is protected !!