News January 30, 2025
డీప్‌సీక్ Ai.. అక్యూరసీ రేటు 17% మాత్రమే!

చైనా Ai స్టార్టప్ డీప్‌సీక్‌పై NewsGuard అనే సంస్థ చేసిన ఆడిట్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. దీని కచ్చితత్వం (అక్యూరసీ రేటు) 17% మాత్రమే ఉందని పేర్కొంది. పలు దేశాలకు చెందిన ChatGPT(ఓపెన్ ఏఐ), జెమిని(గూగుల్) లాంటి 11 ఏఐలలో డీప్‌సీక్ 10వ స్థానంలో నిలిచిందని వెల్లడించింది. తప్పుడు, టైమ్ వేస్ట్ చేసే జవాబులు ఇస్తోందని తెలిపింది. చైనాకు సంబంధించిన ప్రశ్నలకు సైతం డీప్‌సీక్ చేతులెత్తేస్తోంది.
Similar News
News December 10, 2025
మా దేశం పేరు సంస్కృతం నుంచే వచ్చింది: సింగపూర్ మాజీ డిప్యూటీ PM

సింగపూర్ లేదా సింగపురా అనే పేరు సంస్కృతం నుంచి ఉద్భవించిందని ఆ దేశ మాజీ ఉప ప్రధాని తియో చీ హియాన్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన అటల్ బిహారీ వాజ్‌పేయి మెమోరియల్ లెక్చర్‌లో ఆయన మాట్లాడుతూ భారత్-సింగపూర్ చారిత్రక అనుబంధం గురించి వెల్లడించారు. 1867 వరకు కోల్‌కతా నుంచి సింగపూర్ పరిపాలన జరిగిందని గుర్తుచేశారు. తమ దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో భారతీయులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు.
News December 10, 2025
సుందర్ పిచాయ్‌తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్‌తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


