News January 28, 2025
DeepSeek: చైనా యాప్ కదా అరుణాచల్ ఎక్కడుందో తెలీదు పాపం!

గ్లోబల్ టెక్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న చైనీస్ డీప్‌సీక్ AIకి పాపం..! అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడుందో తెలియదట. అదొక భారత రాష్ట్రమని ప్రాంప్ట్ ఇస్తే ‘సారీ, అది నా నాలెడ్జ్‌కు అందని ప్రశ్న. ఇంకేదైనా మాట్లాడుకుందామా’ అని జవాబిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల గురించీ తెలియదట. మన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా పేచీలు పెట్టే సంగతి తెలిసిందే. అది టిబెట్‌లో భాగమని వాదిస్తుంటుంది. అందుకే ఆ యాప్ వీటిపై జవాబులివ్వడం లేదు.
Similar News
News December 18, 2025
అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత

అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. లక్సెంబర్గ్‌లోని యూరోపియన్ హెడ్‌క్వార్టర్స్‌లో 370 జాబ్స్‌కు కోత పెట్టనుంది. అక్కడ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం కంపెనీ చరిత్రలో తొలిసారి. AI వినియోగంపై దృష్టిపెట్టిన అమెజాన్ 14 వేలకు పైగా ఉద్యోగులను తొలగిస్తామని అక్టోబర్‌లో ప్రకటించింది. లక్సెంబర్గ్‌లో తొలుత 470 మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. అయితే స్టాఫ్‌తో చర్చల తర్వాత ఆ సంఖ్యను తగ్గించింది.
News December 18, 2025
చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు

AP: సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ‘మా కుటుంబానికి, ఏపీకి గర్వకారణమైన క్షణం. సీఎం చంద్రబాబును బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎకనమిక్ టైమ్స్ సంస్థ సత్కరించింది. భారతదేశ సంస్కరణల ప్రయాణాన్ని ఇంత స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో తీర్చిదిద్దిన నాయకులు కొందరే. ఈ అవార్డు ఆయన సంస్కరణలు, వేగం, పాలనపై నమ్మకానికి దక్కిన గౌరవం’ అని ట్వీట్ చేశారు.
News December 18, 2025
అంటే.. ఏంటి?: Espionage..

గూఢచర్యం (నిఘా)తో రహస్య, ముఖ్య సమాచారం సేకరించడాన్ని ఇంగ్లిష్‌లో Espionage అంటారు. ఇందుకోసం వ్యక్తులు లేదా జంతువులు లేదా ఇతర ప్రాణులు, డివైజ్‌లను వ్యక్తులు/సంస్థలు వాడుతాయి. ఈ పదం ఫ్రెంచ్ భాషలోని Espionnage (Spy) నుంచి పుట్టింది.
తరచుగా వాడే పర్యాయ పదాలు: Spying, Surveillance
– రోజూ 12pmకు ‘అంటే.. ఏంటి?’లో ఓ ఇంగ్లిష్ పదానికి అర్థం, పద పుట్టుక వంటి విషయాలను తెలుసుకుందాం.
Share it


