News January 17, 2025
అర్జున అవార్డు అందుకున్న దీప్తి జీవాంజి

పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన తెలుగు తేజం దీప్తి జీవాంజి అర్జున అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా దీప్తి అవార్డు తీసుకున్నారు. వరంగల్ జిల్లా కల్లెడకు చెందిన దీప్తి పారాలింపిక్స్ ఉమెన్స్ 400మీ పరుగులో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు.
Similar News
News February 8, 2026
వనపర్తి: మున్సిపల్ బరిలో సతీమణుల సమరం

వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డులో పాత ప్రత్యర్థులే ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. కాకపోతే గతసారి భర్తలు పోటీల్లో ఉండగా ఈసారి మహిళలకు రిజర్వ్ కావడంతో భార్యలను బరిలో దింపారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా సత్యం, బీఆర్‌ఎస్ నుంచి మెకానిక్ శీను, బీజేపీ నుంచి భరత్ పోటీలో ఉండగా సత్యం విజయం సాధించారు. ఈసారి మూడు పార్టీల నుంచి ముగ్గురి సతీమణులు పోటీలో ఉన్నారు. గెలుపు ఎవరిని వరిస్తుందో వచి చూడాల్సిందే.
News February 8, 2026
ఎల్లారెడ్డి: ‘ఈ ఉత్సాహం గెలుపునకు సంకేతం’: KTR

ఎల్లారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని చూసి ఆయన పులకించిపోయారు. ఈ మేరకు ఆయన ‘X’ వేదికగా స్పందిస్తూ.. ‘ఎల్లారెడ్డి పట్టణంలో అద్భుతమైన స్పందన మధ్య నేటి పర్యటన ముగిసింది. ప్రజల నుంచి వచ్చిన ఈ సానుకూలత రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా విజయానికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నాను’ అని పబ్లిక్ మీటింగ్ ఫొటోలను జత చేస్తూ పోస్ట్ చేశారు.
News February 8, 2026
శుభ సమయం (08-2-2026) ఆదివారం

➤ తిథి: బహుళ సప్తమి తె.5.23 వరకు ➤ నక్షత్రం: స్వాతి తె.5.42 వరకు ➤ శుభ సమయాలు: ఉ.7.28-9.41 వరకు, ఉ.11.25-ఉ.12.11, మ.2.05-సా.4.20 వరకు ➤ రాహుకాలం: సా.4.30-6.30 వరకు ➤ యమగండం: మ.12.00-మ.1.30 వరకు ➤ దుర్ముహూర్తం: సా.4.21-సా.5.06 వరకు ➤ వర్జ్యం: ఉ.9.42-మ.11.26 వరకు ➤ అమృత ఘడియలు: రా.8.08-రా.9.52 వరకు


