News February 9, 2025
UP వారియర్స్ కెప్టెన్‌గా దీప్తి శర్మ

WPLలో యూపీ వారియర్స్ కెప్టెన్‌గా భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మను ఆ ఫ్రాంచైజీ నియమించింది. గత సీజన్‌లో దీప్తి ఆ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 27 ఏళ్ల దీప్తి భారత్ తరఫున 124 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. WPLలో 17 మ్యాచులు ఆడి 385 పరుగులు, 19 వికెట్లు సాధించారు.
Similar News
News April 10, 2026
ఇజ్రాయెల్ ఫైర్.. పోస్ట్ డిలీట్ చేసిన పాక్ మంత్రి

ఇజ్రాయెల్ ‘మానవాళికి శాపం’ అని, లెబనాన్‌లో ‘నరమేధం’ సృష్టిస్తోందంటూ పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆఫీస్ తీవ్రంగా స్పందించింది. శాంతి చర్చల్లో మధ్యవర్తిగా ఉంటూ ఇజ్రాయెల్ అంతాన్ని కోరడం ఏంటని మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలను అస్సలు సహించబోమని గట్టిగా హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన ఖవాజా తన ‘X’ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేశారు.
News April 10, 2026
పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.
News April 10, 2026
పంటల్లో ఎర్రనల్లిని ఎలా నివారించాలి?

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.


