News February 13, 2025
మంత్రి సురేఖపై పరువునష్టం దావా.. విచారణ 27కు వాయిదా

TG: నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సురేఖ ఇప్పటికే క్షమాపణ చెప్పారని ఆమె తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే మీడియా ముఖంగా ఆమె చేసిన విమర్శలకు, కోర్టుకు సమర్పించిన వివరాలకు పొంతన లేదని నాగార్జున తరఫు లాయర్ పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
Similar News
News December 4, 2025
ఎయిడ్స్ నియంత్రణలో APకి ఫస్ట్ ర్యాంక్

AP: HIV నియంత్రణ, బాధితులకు వైద్యసేవలందించడంలో AP దేశంలో తొలి స్థానంలో నిలిచిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నిర్దేశిత 138 ప్రమాణాల్లో 105లో ఉత్తమ పనితీరు కనబరిచిందన్నారు. న్యాక్ త్రైమాసిక నివేదికలో రాష్ట్రం 2వ స్థానంలో ఉండగా అర్ధసంవత్సర ర్యాంకుల్లో ప్రథమ స్థానం సాధించినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల కన్నా ఉత్తమ పనితీరు కనబరిచిన ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
News December 4, 2025
PHOTO: 25 ఏళ్ల క్రితం పుతిన్తో మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన వేళ 25 ఏళ్ల క్రితంనాటి ఓ ఫొటో వైరలవుతోంది. 2001లో అప్పటి ప్రధాని వాజ్పేయితో కలిసి గుజరాత్ సీఎం హోదాలో మోదీ మాస్కో పర్యటనకు వెళ్లారు. రెండు దేశాల అగ్రనేతల భేటీ సమయంలో.. అక్కడ మోదీ కూడా ఉన్న ఫొటో తాజాగా బయటకొచ్చింది. దీనిని చూస్తూ.. మోదీ, పుతిన్ల మధ్య ఉన్న స్నేహబంధం దాదాపు 25 ఏళ్ల నాటిదని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ బంధం ఇలాగే కొనసాగాలని కోరుతున్నారు.
News December 4, 2025
గోల్డ్ లోన్? పర్సనల్ లోన్? ఏది బెటర్

మీ దగ్గర బంగారం ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవడం గుడ్ ఛాయిస్. అత్యవసరంగా డబ్బులు అవసరమైతే బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. తనఖా పెట్టిన కొద్దిసేపటికే డబ్బులు అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. నెల నెలా వడ్డీ కట్టే సమస్య ఉండదు. సంవత్సరం చివరిలో లేదంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చెల్లించి మీ బంగారం వెనక్కి తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ EMI చెల్లింపు మిస్ అయితే వడ్డీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.


