News July 15, 2024
అసత్య ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా: విజయసాయిరెడ్డి

AP: తనకు అక్రమ సంబంధం <<13632336>>అంటగట్టి<<>> అసత్య ప్రచారం చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రామోజీరావునే ఎదుర్కొన్నానని, ఇప్పుడు ఈ కుట్ర వెనుక ఉన్నవాళ్లకూ బుద్ధి చెబుతానని హెచ్చరించారు. పరువు నష్టం దావా వేయడంతోపాటు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని తెలిపారు. ఓ వర్గం మీడియా దుష్ప్రచారాలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతానని చెప్పారు.
Similar News
News December 16, 2025
IPL-2026 అప్డేట్

IPL 2026 ప్రారంభ తేదీ మారింది. తొలి మ్యాచ్ మార్చి 26న జరగనుందని Cricbuzz వెల్లడించింది. మే 31న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. కాగా ఇదివరకు మార్చి 15న ఐపీఎల్ ప్రారంభం అవుతుందని నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రేపు అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.
News December 16, 2025
IPL ఆక్షన్.. వీరిపైనే ఫ్రాంఛైజీల ఫోకస్?

మరికొన్ని గంటల్లో IPL మినీ వేలం జరగనుంది. కొందరు ప్లేయర్ల కోసం తీవ్ర పోటీ ఉండే ఛాన్సుంది. ఈ లిస్టులో గ్రీన్(AUS), పతిరణ, హసరంగా(SL), రవి బిష్ణోయ్, V అయ్యర్(IND), మిల్లర్, డికాక్, నోర్జ్(SA), జేమీ స్మిత్, లివింగ్ స్టోన్(ENG) వంటి ఆటగాళ్లున్నారు. అటు గత వేలంలో అన్సోల్డ్గా మిగిలిన IND బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఈసారి సోల్డ్ అవుతారా? వారిని ఏ టీమ్ తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
News December 15, 2025
కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆన్లైన్ క్లాసులు

ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆఫ్లైన్ తరగతులను నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీరందరికీ ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. అన్ని పాఠశాలలు ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే 228 విమానాలు రద్దయ్యాయి.


