News October 4, 2024
పరువు నష్టం.. ఈ శిక్షలు పడొచ్చు

ఎవరైనా పరువుకు భంగం కలిగిస్తే దానిపై కోర్టులో <<14263146>>పరువునష్టం<<>> దావా వేయవచ్చు. నేరం రుజువైతే 2 సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. IPC సెక్షన్ 500 ప్రకారం ఈ శిక్షలుంటాయి. గతంలో మోదీ పేరుపై చేసిన కామెంట్స్‌కు గానూ రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అయితే దానిపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఇటీవల శివసేన నేత సంజయ్ రౌత్‌కు 15రోజుల జైలు శిక్ష పడింది.
Similar News
News January 11, 2026
బ్రేక్‌ఫాస్ట్ ఏ టైమ్‌లో చేస్తున్నారు?

ప్రతి రోజూ 8AMకి అల్పాహారం తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ‘జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు కంట్రోల్లో ఉంటుంది. శరీరంలో శక్తి స్థాయులు పెరుగుతాయి. బాడీకి అవసరమయ్యే గ్లూకోజ్ అంది రోజంతా చురుకుగా ఉంటారు. డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది’ అని పేర్కొంటున్నారు. ప్రొటీన్, ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, <<17756449>>బ్రేక్‌ఫాస్ట్<<>> ఆలస్యంగా చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
News January 11, 2026
రాబోయే 3 రోజులు గజగజ

TG: రాష్ట్రంలో రాత్రి నుంచి ఉదయం వరకు చలి వణికిస్తోంది. పొగమంచు, చలి గాలుల తీవ్రతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 3 రోజులు చలి మరింత పెరుగుతుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ నెల చివరి వారంలో ఉత్తర, మధ్య తెలంగాణ, తూర్పు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
News January 11, 2026
రవితేజ నెక్ట్స్ సినిమా ఈ డైరెక్టర్‌తోనే!

మాస్ మహారాజా రవితేజ తన నెక్ట్స్ సినిమా డైరెక్టర్‌ను అనౌన్స్ చేశారు. నిన్ను కోరి, మజిలీ వంటి హిట్ మూవీలు తీసిన శివ నిర్వాణతో కలిసి పని చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల థ్రిల్లర్ జోనర్లో ఆయన కథ వినిపించగా రవితేజకు నచ్చి ఓకే చేసినట్లు సమాచారం. త్వరలోనే మూవీపై అధికారిక ప్రకటన రానుందని టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. అటు రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈనెల 13న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.


