News August 25, 2024
బంగ్లా చేతిలో ఓటమి.. ఎనిమిదో స్థానానికి పడిపోయిన పాక్

రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా <<13938635>>ఓడిన<<>> పాకిస్థాన్ WTC పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 6 టెస్టుల్లో 4 ఓటములు, 2 విజయాలతో 30.56% పాయింట్లతో చివరి నుంచి రెండో ప్లేస్‌కు దిగజారింది. ఇండియా 68.52% పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత AUS(62.50%), NZ(50%), ENG(41.07%), SL(40%), BAN(40%), SA(38.89%) ఉన్నాయి. అట్టడుగున WI(18.52) ఉంది.
Similar News
News February 27, 2026
SBI క్లర్క్ పోస్టులు.. మెయిన్ ఫలితాలు విడుదల

SBI క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. 2025 నవంబర్ 21న ఈ పరీక్ష జరిగింది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LPT)కు హాజరు కావాల్సి ఉంటుంది. కాగా దాదాపు 6వేలకు పైగా క్లర్క్ పోస్టులకు గతేడాది AUGలో నోటిఫికేషన్ వచ్చింది. రిజల్ట్స్ కోసం ఇక్కడ <
News February 27, 2026
3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా HPV టీకా: సత్యకుమార్

AP: సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్లు కలిగిన 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సిన్ ఇవ్వనున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. VZM జిల్లా చీపురుపల్లిలో శనివారం CM చంద్రబాబు దీన్ని ప్రారంభిస్తారన్నారు. ‘తొలివిడతగా కేంద్రం నుంచి 1,90,800 డోసులు వచ్చాయి. మిగతా వ్యాక్సిన్ ఇంకా అందుతుంది. కోల్డ్ స్టోరేజీ ఉన్న 1,645 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు’ అని చెప్పారు.
News February 27, 2026
విజయ్ భార్య విడాకుల పిటిషన్.. రాజకీయ కుట్ర?

హీరో విజయ్ భార్య సంగీత విడాకులు కోరడం వెనుక రాజకీయ కుట్ర ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఓ నటితో ఆయనకు సంబంధం ఉన్నట్లు 2021లోనే గుర్తించానన్న ఆమె.. ఇప్పుడు కోర్టుకెక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని, అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. ప్రత్యర్థులు దీన్ని ఆయుధంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.


