News July 5, 2024

UK ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి

image

వక్త, రచయిత ఉదయ్ నాగరాజు UK ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. TGలోని సిద్దిపేట(D) శనిగరానికి చెందిన నాగరాజు భారత మాజీ PM పీవీ నరసింహారావుకు బంధువు. నిజామాబాద్‌(D) కోటగిరికి చెందిన కన్నెగంటి చంద్ర కన్జర్వేటివ్ అభ్యర్థిగా స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్‌‌లో ఓడిపోయారు. జనరల్ ప్రాక్టిషనర్‌గా సేవలందించిన ఆయన రెండుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గా పనిచేశారు.

Similar News

News April 2, 2026

స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం, డిప్యూటీ సీఎం బిజీబిజీ

image

TG: ఈనెల 9న పుదుచ్చేరి, కేరళం, అస్సాం రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అక్కడ స్టార్ క్యాంపెయినర్లుగా బిజీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేరళంలో పర్యటిస్తుండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు, రేపు పుదుచ్చేరిలో పర్యటిస్తారు. ఆ తర్వాత ఈనెల 4న కేరళంలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు సైతం కేరళంలో ప్రచారంలో పాల్గొన్నారు. <<-se>>#Elections2026<<>>

News April 2, 2026

కరెంట్ అఫైర్స్

image

* డీజీసీఏ చీఫ్‌గా వీర్ విక్రమ్ యాదవ్ నియామకం
* AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
* ‘పారాక్వాట్’ గడ్డిమందుపై తెలంగాణ తాత్కాలిక నిషేధం
* భారత్ తొలి డిజిటల్ సెన్సస్ ప్రారంభం
* గుజరాత్‌లో కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
* భారతీయ నేవీ అమ్ములపొదిలోకి సంశోధక్ సర్వే నౌక
* భారత్ వేదికగా మే నెలలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు

News April 2, 2026

సేల్స్‌లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 5శాతమే.. అదే కారణమా?

image

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నా కార్లలో వీటి వాటా ఐదు శాతంలోపే ఉంది. FY26లో మొత్తం 2,29,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఏడాదితో (1,23,400 యూనిట్లు) పోలిస్తే వృద్ధి నమోదైనా ఆశించినంత వేగంగా సేల్స్ పెరగట్లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఛార్జింగ్ స్టేషన్ల కొరత, కార్ రేంజ్‌ – రీసేల్ వ్యాల్యూపై అనుమానాలు ఇందుకు కారణమని పేర్కొంటున్నాయి.