News June 4, 2024

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు మాజీ సీఎంల ఓటమి

image

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు మాజీ సీఎంలు ఓటమి పాలయ్యారు. అనంత్‌నాగ్-రాజౌరి నియోజకవర్గం నుంచి మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సమీప JKNC పార్టీ అభ్యర్థి మియాన్ అహ్మద్ చేతిలో పరాజయం పాలయ్యారు. మరోవైపు బారముల్లా నియోజకవర్గంలో JKNC ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్ చేతిలో లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Similar News

News October 14, 2025

రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు: మంత్రి లోకేశ్

image

AP: విశాఖలో గూగుల్ అడుగుపెట్టడం సంతోషంగా ఉందని, ఇది రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు అని మంత్రి లోకేశ్ అభివర్ణించారు. ఇది గ్లోబల్ టెక్ మ్యాప్‌పై APని బలంగా నిలబెట్టే మైలురాయి అవుతుందన్నారు. ఢిల్లీలో గూగుల్‌తో ఒప్పంద కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్రం సహకారం, విజనరీ లీడర్ CBN నాయకత్వంలో రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని చెప్పారు. డిజిటల్ హబ్‌గా దేశానికి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.

News October 14, 2025

ESIC ఇండోర్‌లో 124 ఉద్యోగాలు

image

ESIC ఇండోర్ కాంట్రాక్ట్ పద్ధతిలో 124 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి MBBS/MD/MSతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 21లోగా ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in/recruitments

News October 14, 2025

మల్లోజుల వేణుగోపాల్ నేపథ్యమిదే!

image

<<18001632>>మల్లోజుల వేణుగోపాల్<<>> అలియాస్ సోనూ దివంగత మావోయిస్టు కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ తమ్ముడు. ఇతని స్వస్థలం TGలోని పెద్దపల్లి. బీకాం చదివిన ఈయన గడ్చిరోలి, ఏపీ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2011 NOVలో బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ చనిపోగా, ఆ తర్వాత వేణుగోపాల్ భార్య తార లొంగిపోయారు. 69ఏళ్ల వయసున్న వేణుగోపాల్ మునుపటిలా యాక్టివ్‌గా లేరని సమాచారం.