News October 10, 2024

బరి తెగించిన టీడీపీ ఎమ్మెల్యేలు: VSR

image

AP: మద్యం షాపుల దరఖాస్తుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సిండికేట్‌గా మారి సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ‘కమీషన్లు, దందాలతో ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు. వాళ్ల అవినీతి పరాకాష్ఠకు చేరింది. 4 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. MLAలపై వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. లేదంటే శ్వేతపత్రం సమర్పించి విచారణకు ఆదేశించాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News October 10, 2024

పాక్ కెప్టెన్ ఇంట్లో తీవ్ర విషాదం

image

పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమె హుటాహుటిన దుబాయ్ నుంచి కరాచీ బయల్దేరి వెళ్లారు. ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్‌కు వైస్ కెప్టెన్ మునీబా అలీ సారథిగా వ్యవహరిస్తారు. కాగా మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఫాతిమా సారథ్యంలో పాక్ ఒక మ్యాచ్ గెలిచి, మరొకటి ఓడింది.

News October 10, 2024

తూర్పుగోదావరిలో డ్రగ్స్ కలకలం.. నలుగురు అరెస్ట్

image

AP: నగరాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ పట్టణాలకూ విస్తరిస్తోంది. తాజాగా తూ.గో(D) భూపాలపట్నంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. తాడేపల్లిగూడెంకు చెందిన నలుగురు యువకులు టెలిగ్రామ్‌లో కొకైన్ కొనుగోలు చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా టౌన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 4గ్రా. కొకైన్, 50గ్రా. గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.

News October 10, 2024

ఏపీకి వెళ్లాల్సిందే.. IASల విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్రం

image

తెలంగాణలోని ఏపీ కేడర్ IASలపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణలోనే కొనసాగించాలని రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి సహా 11 మంది IAS ఆఫీసర్లు విజ్ఞప్తి చేయగా కేంద్రం తిరస్కరించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.