News July 10, 2024
ఫిరాయింపు రాజకీయాలు.. ఇద్దరి మధ్య తేడా ఏంటో?

TG: 2018లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకున్న BRS నేత కేటీఆర్.. ఫిరాయింపులు చట్టవిరుద్ధమని మాట్లాడుతున్నారు. ఆ 12 మంది స్వచ్ఛందంగా పార్టీని విలీనం చేశారని, ఇప్పుడు రేవంత్ తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని ప్రతిపక్ష నేతగా గర్జించిన రేవంత్.. ఇప్పుడు చేరికలను ప్రోత్సహిస్తున్నారు. మరి ఈ ఫిరాయింపు రాజకీయాలపై మీ కామెంట్?
Similar News
News November 21, 2025
టెట్ దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగియనుంది. ఇప్పటివరకు 1,97,823 అప్లికేషన్లు వచ్చాయి. పురుషులు 66,104, మహిళలు 1,31,718 మంది దరఖాస్తు చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకూ TET తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 17,883 మంది టీచర్లూ టెట్కు అప్లై చేశారు. అయితే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలైనందున తమకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుందని టీచర్లు ఆశిస్తున్నారు.
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News November 21, 2025
పరమ పావన మాసం ‘మార్గశిరం’

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.


