News February 6, 2025
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు: కేటీఆర్

TG: యూజీసీ నిబంధనలు మార్చడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఢిల్లీలో కలిశామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మార్పుపై అభ్యంతరం తెలియజేస్తూ ఆయనకు లేఖ ఇచ్చామని వెల్లడించారు. NSC క్లాజ్‌తో రిజర్వ్డ్ వర్గాలకు అన్యాయం జరిగే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని KTR తేల్చి చెప్పారు. ఉపఎన్నికలు జరగాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు.
Similar News
News April 2, 2026
నిట్కాన్ లిమిటెడ్‌లో 100 జూనియర్ ఇంజినీర్ పోస్టులు

కాంట్రాక్ట్ పద్ధతిలో 100 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నిట్కాన్ లిమిటెడ్, ఢిల్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సివిల్‌లో 80, ఎలక్ట్రికల్/ మెకానికల్ల్లో 20 పోస్టులున్నాయి. ఇంజినీరింగ్ డిప్లొమాతో పాటు 3 ఏళ్ల పని అనుభవం, ఇంజినీరింగ్‌తో పాటు ఏడాది ఉద్యోగ అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు 08.04.26 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం nitcon.org చూడండి.
News April 2, 2026
ఫుట్‌బాల్ WC ఫైనల్ టికెట్ ధర ₹10 లక్షలు

ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జులై 19న న్యూజెర్సీలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం టాప్ కేటగిరీ టికెట్ ధరను ఫిఫా ఏకంగా $10,990గా (సుమారు ₹10.22 లక్షలు) నిర్ణయించింది. ఒక్క మ్యాచ్ టికెట్‌తో ఇండియాలో కారు కొనొచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జూన్ 11న మెక్సికోలో మొదలయ్యే ఈ సాకర్ పండగలో మొత్తం 48 జట్లు తలపడనున్నాయి.
News April 2, 2026
రేపు జాగ్రత్త: APSDMA

AP: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDMA వెల్లడించింది. 42-43 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రేపు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు, 16 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ గరిష్ఠంగా విజయనగరం జిల్లా రాజాంలో 40.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించింది.


