News October 27, 2024
సైనికులతో దీపావళి చేసుకోనున్న రక్షణ మంత్రి
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఏడాది దీపావళిని జవాన్లతో కలిసి చేసుకోనున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో తవాంగ్ జిల్లాలో బోర్డర్ వద్ద గస్తీ కాస్తున్న సైనికులతో కలిసి ఆయన వేడుక జరుపుకోనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందు భారత వాయుసేనకు చెందిన ఉత్తరాఖండ్ వార్ మెమోరియల్ కార్ ర్యాలీ తవాంగ్‌కు చేరుకోనుంది. ఆ ర్యాలీకి అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖాండూ, డిప్యూటీ సీఎం చౌనా మీన్ స్వాగతం పలకనున్నారు.
Similar News
News November 1, 2024
ఎగబడి కొన్నారు.. అంతలోనే వదిలేశారు..!
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను గత ఐపీఎల్ వేలంలో KKR ఎగబడి మరీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా రూ.24.75 కోట్లు పెట్టి దక్కించుకుంది. కానీ పట్టుమని పది నెలలు కూడా గడవకముందే అతడిని వదిలేసింది. గత సీజన్లో ఫెయిల్ కావడం వల్లే ఆ ఫ్రాంచైజీ వదిలేసినట్లు టాక్. కాగా ఈ నెలలో జరగబోయే మెగా వేలంలో స్టార్క్‌ను దక్కించుకునేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
News November 1, 2024
జేఎంఎం మొత్తం ఓ నకిలీ వ్యవస్థ: హిమంత బిశ్వ
ఝార్ఖండ్ ముక్తి మోర్చా మొత్తం ఓ నకిలీ వ్యవస్థ అని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. CM హేమంత్ సోరెన్ వయసుపై వివాదం రేగడంపై ఆయన స్పందించారు. ‘JMM వ్యవస్థ మొత్తం నకిలీ. అఫిడవిట్‌ను పరిశీలిస్తే సోరెన్ వయసు కూడా పెరిగింది. ఇది చొరబాటుదారుల ప్రభుత్వం. JMMను తిరిగి అధికారంలోకి తీసుకొస్తే ఎవరూ సురక్షితంగా ఉండరు. ప్రజలు బాధ్యతగా వారిని గద్దెదించాలి’ అని శర్మ పిలుపునిచ్చారు.
News November 1, 2024
IED బాంబు పేల్చిన ఉగ్రవాదులు.. ఏడుగురు మృతి
పాక్ బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉగ్రవాదులు రిమోట్ కంట్రోల్డ్ IED బాంబును పేల్చిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మస్తాంగ్ జిల్లాలోని సివిల్ ఆస్పత్రి చౌక్ వద్ద పోలీసు వ్యాన్ టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. ముందుగానే పార్కింగ్ చేసిన బైక్‌లో బాంబులు ఉంచి రిమోట్ కంట్రోల్‌తో వాటిని పేల్చినట్టు మస్తాంగ్ DPO ఉమ్రానీ తెలిపారు. మృతుల్లో ఐదుగురు స్కూల్ పిల్లలు, ఒక పోలీసు ఉన్నారు. మరో 17 మంది గాయపడ్డారు.