News October 17, 2024

రేపటి నుంచి తెరుచుకోనున్న డిగ్రీ, పీజీ కాలేజీలు

image

TG: రాష్ట్రంలో డిగ్రీ, PG కాలేజీలు రేపటి నుంచి యథావిధిగా నడిపిస్తామని ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల విషయంలో అసోసియేషన్ సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వారు బంద్‌ను విరమించారు. ఇదిలా ఉంటే బకాయిలు విడుదల చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని R.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Similar News

News December 15, 2025

అంచనాలను అందుకోని రబీ సాగు

image

AP: గత కొన్ని నెలలుగా వర్షాభావం, అధిక వర్షాల ప్రభావం ప్రస్తుత రబీ సీజన్‌పై ప్రభావం చూపింది. 2 నెలలు గడుస్తున్నా రబీ సాగు అంచనాలను అందుకోలేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరుగుతోంది. వరి 1.33 లక్షలు, చిరుధాన్యాలు 1.21 లక్షలు, నూనెగింజలు 0.21 లక్షలు, అపరాలు 3.44 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి.

News December 15, 2025

లెజెండరీ సింగర్ బయోపిక్‌లో సాయిపల్లవి

image

లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. టైటిల్ రోల్‌లో హీరోయిన్ సాయిపల్లవిని తీసుకునే యోచనలో ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. గీతా ఆర్ట్స్ నిర్మాణ సారథ్యంలో గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News December 15, 2025

ఎయిమ్స్ కల్యాణిలో 172 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

పశ్చిమ బెంగాల్‌లోని <>ఎయిమ్స్<<>> కల్యాణిలో 172 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DNB, DM, MCH, MSc, M.biotech, M.Stat, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in/