News October 15, 2024
నేటి నుంచి డిగ్రీ కళాశాలలు బంద్

TG: ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలనే డిమాండ్‌తో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నేటి నుంచి బంద్ పాటిస్తున్నాయి. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలలు నడపలేకపోతున్నామని డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలిపింది. ఉద్యోగుల జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నట్లు పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది.
Similar News
News December 31, 2025
2025: గోల్డ్ ₹57వేలు, వెండి ₹1.6L పెరిగింది!

ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. JANలో 10gల బంగారం ధర ₹78,000 ఉండగా.. డిసెంబర్ 31న ₹1,35,880తో ముగించి ఇన్వెస్టర్లకు దాదాపు 78%(₹57k) లాభాలను అందించింది. అటు కిలో వెండి ధర 2025 ప్రారంభంలో ₹98,000 ఉండగా ప్రస్తుతం ₹2.58 లక్షలకు చేరుకొని 150%(₹160k) పైగా వృద్ధిని నమోదు చేసింది. కొత్త ఏడాదిలో గోల్డ్, సిల్వర్ ధరలెలా ఉంటాయో చూడాలి.
News December 31, 2025
పెద్దిరెడ్డి ఫ్యామిలీకి షాక్!

AP: జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి గట్టి షాక్ తగిలిందన్న చర్చ సాగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరును అన్నమయ్య జిల్లాలో విలీనం చేశారు. ఇక ఆయన కుమారుడు, MP మిథున్ రెడ్డి స్థానం రాజంపేట, సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి సీటు తంబళ్లపల్లి సైతం చిత్తూరులో లేవు. దీంతో పెద్దిరెడ్డి హవాకు బ్రేక్ పడిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
News December 31, 2025
సర్వీస్ ఛార్జ్ బాదుడు.. రెస్టారెంట్‌కు ₹50,000 ఫైన్

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్ వసూలు చేసినందుకు ముంబైలోని బోరా బోరా రెస్టారెంట్‌కు CCPA ₹50,000 ఫైన్ వేసింది. కస్టమర్ అనుమతి లేకుండానే 10% సర్వీస్ ఛార్జ్ కలిపింది. దానిపై అదనంగా GST కూడా వసూలు చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని CCPA స్పష్టం చేసింది. సర్వీస్ ఛార్జ్ పూర్తిగా స్వచ్ఛందమని గుర్తుచేసింది. దీన్ని హోటళ్లు, రెస్టారెంట్ తప్పనిసరి చేయొద్దని ఢిల్లీ హైకోర్టు గతంలోనే తీర్పిచ్చింది.


