News November 19, 2024

నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బంద్!

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమయ్యాయి. రూ.2వేలకోట్ల బకాయిలు విడుదల చేసే వరకూ కాలేజీల బంద్‌ను కొనసాగిస్తామని, సెమిస్టర్ పరీక్షలనూ బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఈ బంద్‌లో కాలేజీలు పాల్గొనాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.

Similar News

News November 19, 2024

రోజుకు 14గంటలు పనిచేయాల్సిందేనన్న CEO.. నెట్టింట విమర్శలు!

image

ఉద్యోగులు వారానికి 70గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు చనిపోతున్నారని నెట్టింట విమర్శలూ వచ్చాయి. తాజాగా భారత సంతతి వ్యక్తి, శాన్‌ఫ్రాన్సిస్కోలోని ‘గ్రెప్లైట్’ CEO దక్ష్ గుప్తా కూడా రోజుకు కనీసం 14గంటలు పనిచేయాలని చెబుతున్నారు. ఒక్కోసారి ఆదివారాలు వర్క్ చేయాలని చెప్పారు. దీంతో నారాయణమూర్తికి శిష్యుడు దొరికాడరనే చర్చ మొదలైంది.

News November 19, 2024

OTD: దివిసీమ విషాదానికి 47 ఏళ్లు

image

AP: దివిసీమ ఉప్పెనకు నేటితో సరిగ్గా 47 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 NOV 19న అర్ధరాత్రి తాటి చెట్ల ఎత్తున, తీరం నుంచి 8 కి.మీ వరకు అలలు పోటెత్తాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి వంటి ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే జల సమాధయ్యారు. 10 వేల మందికిపైగా ప్రజలు, దాదాపు పశువులన్నీ మరణించాయి. ఘటన జరిగిన 3 రోజులకు బాహ్య ప్రపంచానికి తెలిసింది.

News November 19, 2024

ప్రభుత్వ ప్రోత్సాహం.. ఒక్కరోజే 131 ఈవీల కొనుగోలు

image

TG: ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు రవాణా శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 131 ఈవీలు కొన్నట్లు వెల్లడించింది. వీటిలో టూవీలర్లు-121, కార్లు-6, ఆటో రిక్షాలు-3, ఒక గూడ్స్ క్యారేజ్ వాహనం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈవీలపై రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ మినహాయింపును ప్రభుత్వం 2026 DEC 31 వరకు పొడిగించింది. గతంలో ఉన్న వాహన పరిమితి సంఖ్యనూ ఎత్తేసింది.