News October 28, 2024
డిగ్రీ అర్హత.. భారీ జీతంతో 1,500 ఉద్యోగాలు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI)లో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. APలో 200, TGలో 200 ఖాళీలున్నాయి. ఏదైనా డిగ్రీ, పది/ఇంటర్లో స్థానిక భాషను చదివి ఉన్నవారు అర్హులు. వయసు OCT 1, 2024 నాటికి 30 ఏళ్లకు మించొద్దు. NOV 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే అలవెన్సులతో కలిపి జీతం ₹77K పొందొచ్చు.
వెబ్సైట్: <
Similar News
News November 1, 2024
ఆపద్బాంధవుడవయ్యా ముకేశ్!
ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ కేవలం 107 రన్స్‌కే ఆలౌటైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం సాధించి గెలవడం పక్కా అనే దశలో భారత పేసర్ ముకేశ్ కుమార్ ఆపద్బాంధవుడయ్యారు. 46 పరుగులిచ్చి 6 కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముకేశ్ రాణింపుతో భారీ లీడ్ తప్పింది.
News November 1, 2024
IPL: ఈ ప్లేయర్లకు భారీ జాక్‌పాట్
IPL-2025 రిటెన్షన్‌లో పలువురు ప్లేయర్లు జాక్‌పాట్ కొట్టేశారు. RR వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్‌కు 2024లో కేవలం రూ.20 లక్షలు మాత్రమే దక్కగా ఈసారి రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. అంటే ఏకంగా 6900% అధికం. పతిరణ (రూ.13 కోట్లు), రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు), సాయి సుదర్శన్ (రూ.8.50 కోట్లు), శశాంక్ సింగ్ (రూ.5.50 కోట్లు), రింకూ సింగ్ (రూ.13 కోట్లు)లు ఈ లిస్టులో ఉన్నారు.
News November 1, 2024
గెలవాలనే మైండ్‌సెట్ ఉన్న వారినే రిటైన్ చేసుకున్నాం: LSG ఓనర్
ఐపీఎల్: లక్నో రిటెన్షన్లపై ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జట్టు కోసం ఆడే, గెలవాలనే మైండ్‌సెట్ ఉన్న ప్లేయర్లనే మేం రిటైన్ చేసుకున్నాం. టీం కాకుండా వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడేవాళ్లను పక్కనబెట్టాం’ అని వ్యాఖ్యానించారు. కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించే గోయెంకా ఈ కామెంట్స్ చేశారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. రాహుల్ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు.