News September 24, 2025
డిగ్రీ అర్హత.. 3,500 ఉద్యోగాలు

కెనరా బ్యాంకు బ్రాంచుల్లో 3,500 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. APలో 242, TGలో 132 ఉద్యోగాలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులై, 20-28 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ OCT 12. అభ్యర్థులు ముందుగా https://www.nats.education.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు <
Similar News
News September 24, 2025
ఏపీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం

AP: అసెంబ్లీలో 3 బిల్లుల(SC వర్గీకరణ, పంచాయతీ రాజ్ చట్ట సవరణ, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సవరణ)కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. మంత్రి డోలా వీరాంజనేయస్వామి ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లును సభ ఆమోదించింది. దీని ప్రకారం గ్రూప్-1లో అత్యంత వెనుకబడిన 12 కులాలకు 1%, గ్రూప్-2లోని 18 కులాలకు 6.5%, గ్రూప్-3లోని 29 కులాలకు 7.5% రిజర్వేషన్ అమలవనుంది. అలాగే నాలా ఫీజు స్థానిక సంస్థలకే దక్కే బిల్లూ ఆమోదం పొందింది.
News September 24, 2025
మార్కెట్లను వెంటాడుతున్న నష్టాలు

దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలు వెంటాడుతున్నాయి. ఇవాళ కూడా మార్కెట్లు రెడ్‌లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయాయి. కొన్ని కంపెనీలు మినహా అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నెగటివ్ సైన్, అమెరికా H1B వీసా నిబంధనలు ఈ నష్టాలకు కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
News September 24, 2025
OCT 3 నుంచి రేషన్ షాపుల బంద్‌కు నిర్ణయం

TG: కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో అక్టోబర్ 3 నుంచి రేషన్ దుకాణాలు మూసివేసి నిరసన చేయాలని తీర్మానించినట్లు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజు ప్రకటించారు. 1, 2 తేదీల్లో డీలర్లంతా ఉపవాస దీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. 6 నెలల కమీషన్ రూ.120 కోట్లతో పాటు గన్నీ బ్యాగుల డబ్బులు రూ.6 కోట్లు, కేవైసీకి సంబంధించి రూ.15 కోట్లు ప్రభుత్వం చెల్లించాలని ఆయన వివరించారు.