News April 9, 2024
సమ్మర్లో వీటితో డీహైడ్రేషన్‌కు చెక్?

సమ్మర్లో ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే కొన్ని పండ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నీరు ఎక్కువగా ఉన్న పుచ్చకాయ తింటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. దోసకాయ తీసుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరి నీరు తీసుకుంటే డీహైడ్రేషన్‌ను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. అలాగే టమాటాలు, బూడిదగుమ్మడి, నారింజ, స్ట్రాబెర్రీ, బెల్ పెప్పర్స్ తినాలి.
Similar News
News December 12, 2025
విజయవాడ ఎంపీ గారు.. కాస్త చొరవ తీసుకోండి..!

విజయవాడ కొత్త GGH సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సెంట్రల్ ఏసీ వ్యవస్థ పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్, గుండె సర్జరీలు చికిత్స చేయించుకున్న రోగులకు సరైన గాలి కూడా అందడం లేదు. ఈ సమస్య కొన్ని నెలలుగా ఉన్నా పరిష్కారం లభించడం లేదు. ఇటీవల ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ చిన్నికి అధికారులు సమస్యను వివరించారు. ఎంపీ చొరవ చూపి, తక్షణం సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.
News December 12, 2025
IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తు చేశారా?

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీలో 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iimranchi.ac.in
News December 12, 2025
18 మెట్లు.. 18 దేవతల ఆశీర్వాదం

అయ్యప్ప దర్శనార్థం శబరిలో 18 మెట్లు ఎక్కిన భక్తులు 18 దేవతల ఆశీస్సులు పొందుతారని, వారి జీవితంలోని కష్టాలు పోతాయని నమ్మకం. ఆ 18 మంది దేవతలు వీరే: 1.మహంకాళి 2.కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్యం 5.గంధర్వరాజ 6.కార్తవీర్య 7.క్రిష్ణ పింగళ 8.భేతాళ 9.మహిషాసుర మర్దని 10.నాగరాజ 11.రేణుకా పరమేశ్వరి 12.హిడింబ 13.కర్ణ వైశాఖ 14.అన్నపూర్ణేశ్వరి 15.పుళిందిని 16.స్వప్న వారాహి 17.ప్రత్యంగళి 18.నాగ యక్షిణి. <<-se>>#AyyappaMala<<>>


