News March 31, 2025

DEJAVU: అప్పుడు.. ఇప్పుడు ఒకేలా..!

image

ఐపీఎల్‌లో CSK, RR మధ్య ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 2023, 2025లో ఇరు జట్ల మధ్య ఒకే రీతిలో మ్యాచ్ జరిగింది. 2023లో CSK విజయానికి 21 రన్స్ అవసరం కాగా, 2025లో 20 రన్స్ అవసరమయ్యాయి. అప్పుడూ, ఇప్పుడూ క్రీజులో ధోనీ, జడేజా ఉన్నారు. అప్పుడు, ఇప్పుడూ బౌలర్ సందీప్ శర్మనే. అప్పుడు గెలిచింది, ఇప్పుడు గెలిచింది రాజస్థానే. ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు ‘DEJAVU’ అంటే ఇదేనేమో అని కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News April 1, 2025

వక్ఫ్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తాం: KC వేణుగోపాల్

image

I.N.D.I అలయెన్స్ పార్టీలన్నీ కలిసి వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ‘వక్ఫ్ సవరణ బిల్లుపై మేం తొలినుంచీ వ్యతిరేక వైఖరితోనే ఉన్నాం. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం. కచ్చితంగా వ్యతిరేకిస్తాం. మా కూటమి పార్టీలన్నీ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఇతర పార్టీలు కూడా మాతో కలిసిరావాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.

News April 1, 2025

ముగిసిన లక్నో ఇన్నింగ్స్.. పంజాబ్ లక్ష్యం ఎంతంటే..

image

లక్నోలో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో LSG ఇన్నింగ్స్ ముగిసింది. లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది. పూరన్(30 బంతుల్లో 44), బదోనీ (33 బంతుల్లో 41), సమద్ (12 బంతుల్లో 27) రాణించారు. PBKS బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు ఫెర్గ్యూసన్, మ్కాక్స్‌వెల్, జాన్సెన్, చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు. లక్నో కెప్టెన్ పంత్(5 బంతుల్లో 2) మళ్లీ నిరాశపరిచారు.

News April 1, 2025

APPLY NOW.. నెలకు రూ.5000

image

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువును APR 15 వరకు కేంద్రం పొడిగించింది. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ITI, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8లక్షలలోపు ఉండాలి. దీని ద్వారా దేశంలోని టాప్-500 కంపెనీల్లో ఏడాది ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. నెలకు రూ.5000 స్టైఫండ్, వన్‌టైం గ్రాంట్ కింద రూ.6000 ఇస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

error: Content is protected !!