News February 10, 2025
టీచర్ ఉద్యోగ నియామకాల ఆలస్యం.. హైకోర్టు ఆగ్రహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1732018822759_81-normal-WIFI.webp)
TG: DSC-2008 నియామకాల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 1,382 మందిని ఇవాళ్టిలోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని <<15354548>>ఆదేశించినా<<>> అమలు చేయకపోవడంతో విద్యాశాఖపై మండిపడింది. కోర్టు ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాదిని హెచ్చరించింది. మూడు రోజుల్లోగా ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖ కమిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 17కు వాయిదా వేసింది.
Similar News
News February 11, 2025
రంగరాజన్‌పై దాడిచేసిన వీరరాఘవ రెడ్డి నేపథ్యమిదే..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739234891754_367-normal-WIFI.webp)
చిలుకూరు బాలాజీ అర్చకుడు <<15409945>>రంగరాజన్‌పై దాడిచేసిన<<>> వ్యక్తి వివరాలు బయటకొచ్చాయి. తూ.గో. జిల్లా కొప్పవరానికి చెందిన వీర రాఘవరెడ్డి ‘రామరాజ్యం’ అనే సంస్థను ప్రారంభించి తాము ఇక్ష్వాకుల వంశస్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. ఆలయాలు తిరుగుతూ తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ఇతడు చట్టాలపై మంచి పట్టు తెచ్చుకున్నారు. 2015లో తన కూతురి అడ్మిషన్ విషయంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌పై కేసు వేసి గెలిచారు.
News February 11, 2025
నాలుగు లేన్లుగా కరకట్ట రోడ్డు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739234232898_367-normal-WIFI.webp)
AP: విజయవాడ నుంచి రాజధాని అమరావతి వెళ్లేందుకు ప్రస్తుతమున్న కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. దాదాపు అలైన్మెంట్ పూర్తి కాగా త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం భూసేకరణ/భూసమీకరణ చేయాలా? అనే దానిపై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా నది వరదలను తట్టుకునేలా కరకట్టను బలోపేతం చేయనున్నారు.
News February 11, 2025
సారీ చెప్పిన హీరో.. అయినా తగ్గమంటున్న వైసీపీ ఫ్యాన్స్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739221595901_893-normal-WIFI.webp)
‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై చెలరేగిన <<15417744>>వివాదం<<>> కొనసాగుతోంది. హీరో విశ్వక్సేన్ సారీ చెప్పినా వైసీపీ ఫ్యాన్స్ తగ్గటం లేదు. పృథ్వీరాజ్‌తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 115K+ ట్వీట్లతో #BoycottLaila ఇంకా Xలో ట్రెండ్ అవుతోంది. మరి దీనిపై మరోసారి మూవీ టీమ్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి. ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.