News May 13, 2024

‘ఓటింగ్ వివరాల్లో జాప్యం’.. విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

image

లోక్‌సభ ఎన్నికల్లో తొలి రెండు విడతల పోలింగ్ వివరాలను ఈసీ వెల్లడించడంలో ఆలస్యం కావడంపై ఈనెల 17న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జాప్యం సహా ఈసీ గణాంకాల కచ్చితత్వంపై అనుమానం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం స్వీకరించింది. ప్రాథమిక పోలింగ్ వివరాలతో పోలిస్తే తర్వాత విడుదల చేసిన డేటాలో పోలింగ్ శాతం భారీగా పెరిగిందని పిటిషనర్లు ఆరోపించారు. ఈసీ అసలు రికార్డులను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలన్నారు.

Similar News

News March 4, 2026

అబ్బాయిలు కూడా HPV టీకా వేయించుకోవాలి: వైద్యులు

image

అమ్మాయిలతో పాటు 9-26 ఏళ్లలోపు ఉన్న అబ్బాయిలు కూడా HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పురుషుల్లో వేగంగా పెరుగుతున్న గొంతు, నాలుక, జననేంద్రియ క్యాన్సర్లను ఈ వ్యాక్సిన్ అడ్డుకుంటుందని చెబుతున్నారు. పురుషుల్లో ఈ రకమైన క్యాన్సర్లను గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు లేవని, వ్యాక్సినేషన్ ఒక్కటే నివారణ మార్గమని సూచిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం మగవారికి ఒక్క డోసు సరిపోతుంది.

News March 4, 2026

ఈరోజు నమాజ్ వేళలు (04-3-2026) బుధవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.21 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.33 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు ♦︎ అసర్: మధ్యాహ్నం 3.51 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.24 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.36 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 4, 2026

శుభ సమయం (4-3-2026) బుధవారం

image

➤ తిథి: బహుళ పాడ్యమి సా.4.33 వరకు తదుపరి విదియ ➤ నక్షత్రం: పుబ్బ ఉ.7.37 వరకు, తదుపరి ఉత్తర ➤ శుభ సమయాలు: ఉ.6.17-8.14, ఉ.9.13-10.12, మ.12.33-మ.2.59, సా.4.39-5.02 వరకు ➤ రాహుకాలం: మ.12.00-1.30 వరకు ➤ యమగండం: ఉ.7.30-9.00 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.11.46-మ.12.32 వరకు ➤ వర్జ్యం: మ.3.00-సా.4.38 ➤ అమృత ఘడియలు: రా.12.50 నుంచి 2.48 వరకు