News January 27, 2025
రంజీ జట్టు ప్రకటించిన ఢిల్లీ.. కోహ్లీకి చోటు

రంజీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్తో ఆడే మ్యాచ్కు ఢిల్లీ జట్టును ప్రకటించింది. భారత స్టార్ బ్యాటర్ కోహ్లీ ఎంపిక కాగా, పంత్కు చోటు దక్కలేదు. 13ఏళ్ల తర్వాత విరాట్ రంజీ ఆడనున్నారు. JAN 30నుంచి మ్యాచ్ జరగనుంది.
జట్టు: బదోని, కోహ్లీ, ప్రణవ్, సాంగ్వాన్, అర్పిత్, మయాంక్, శివమ్, సుమిత్, వాన్ష్, మనీ, హర్ష్ త్యాగి, సిద్ధాంత్, సైనీ, యశ్ ధుల్, గగన్, జాంటీ సిద్ధు, హిమ్మత్, వైభవ్, ఆర్. గెహ్లోత్, జితేశ్ సింగ్.
Similar News
News November 22, 2025
రెండేళ్ల పాలనా విజయాలు ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్: CM

TG: ఫ్యూచర్ సిటీలో DEC 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. రెండేళ్ల పాలనా విజయాలు ప్రతిబింబించేలా ఈ వేడుక ఉండాలని సూచించారు. 8న ప్రభుత్వ పథకాలు, విజయాలను చాటి చెప్పాలన్నారు. 9న తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఉండాలని చెప్పారు. పరిశ్రమలు, పెట్టుబడులకు ఇచ్చే ప్రాధాన్యంపై ఆడియో, వీడియో ప్రజెంటేషన్లు రెడీ చేయాలన్నారు.
News November 22, 2025
BREAKING: నిజామాబాద్ DCC అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాట్పల్లి నగేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కూడా పని చేశారు. ఇక నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణను నియమించారు.
News November 22, 2025
సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి

AP: సత్యసాయి బాబా సిద్ధాంతాలు, సూత్రాలే నిజమైన విద్య అని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థలో పట్టభద్రులైన వారికి పట్టాలు అందజేసి మాట్లాడారు. ‘ఇతరుల గురించి బతకడమనేది ఉత్తమ విధానం. ఆధునిక విధానాలతో పాటు సంప్రదాయాలను పాటించాలి. డ్రగ్స్ ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. నో టూ డ్రగ్స్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి’ అని ఆయన సూచించారు.


