News February 8, 2025
ఢిల్లీ అసెంబ్లీ.. ఎప్పుడు ఏ పార్టీది అధికారం?

1952లో 48 స్థానాలకు ఎన్నికలు జరగగా INC 39 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 1956-93 మధ్య ఎన్నికలు జరగలేదు. 1993లో 70 స్థానాలకు గాను BJP 49 చోట్ల గెలిచి సీఎం పదవి చేపట్టింది. 1998, 2003, 2008లో వరుసగా 52, 47, 43 స్థానాలతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. 2013లో ఆప్(28)+కాంగ్రెస్(8) ప్రభుత్వం, 2015, 20లో వరుసగా 67, 62 స్థానాల్లో ఆప్ బంపర్ విక్టరీ సాధించింది. 2025 ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Similar News
News November 27, 2025
భూపాలపల్లి: పంచాయతీ ఎన్నికలు.. మొదటి రోజు నామినేషన్లు ఎన్నంటే?

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని 4 మండలాలు గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లిలో 82 గ్రామ పంచాయతీలకు 45 నామినేషన్లు దాఖలయ్యాయి. 712 వార్డులకు 35 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఏదైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే 24 గంటలు పని చేసేలా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 9030632608 నంబర్కు కాల్ చేయాలని ఆయన చెప్పారు.
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<


