News January 12, 2025

క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ఆరంభించిన ఢిల్లీ సీఎం

image

ఢిల్లీ CM ఆతిశీ మార్లేనా క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ఆరంభించారు. కల్కాజీ నుంచి పోటీ చేసేందుకు రూ.40లక్షలు కావాలంటూ లింకును షేర్ చేశారు. నిజాయితీగా పనిచేసేందుకు AAPకి సామాన్యులిచ్చే చిన్న చిన్న విరాళాలే సాయపడతాయని అన్నారు. ‘ఐదేళ్లు MLA, మంత్రి, ఇప్పుడు ఢిల్లీ CMగా ఉన్న నాకు మీరు వెన్నంటే నిలిచారు. మీ బ్లెసింగ్స్, సపోర్ట్ లేకుండా ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. మీ విరాళాలే నాకు తోడ్పాటునిస్తాయి’ అన్నారు.

Similar News

News January 12, 2025

WC ఆడుతూ యువీ చనిపోయినా గర్వపడేవాడిని: తండ్రి యోగ్‌రాజ్

image

క్యాన్సర్‌తో బాధపడుతూ, రక్తపు వాంతులు చేసుకుంటూ 2011 WCలో యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్‌లు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆ ఘటనపై తాజాగా ఆయన తండ్రి యోగ్‌రాజ్ స్పందించారు. దేశం కోసం WC ఆడుతూ తన కొడుకు చనిపోయినా గర్వపడేవాడినని తెలిపారు. ఇదే విషయం అప్పట్లో యువీకి ఫోన్‌లో చెప్పానని గుర్తుచేసుకున్నారు. ‘నువ్వు బాధపడకు. నీకు ఏం కాదు. దేశం కోసం వరల్డ్ కప్ గెలువు’ అని ధైర్యం నూరిపోశానని పేర్కొన్నారు.

News January 12, 2025

అవార్డుల్లో, అమ్మకాల్లో ఇండియన్ విస్కీలు అదుర్స్!

image

ఆల్కహాల్ పానీయాల మార్కెట్‌లో ఆదాయ పరంగా ఇండియా ప్రపంచంలోనే ఆరో స్థానంలో ఉంది. ఇండియాలో తయారయ్యే కొన్ని బ్రాండ్లు విదేశాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అందులో మెక్‌డోవెల్స్ విస్కీ ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన బ్రాండ్లలో ఒకటిగా రికార్డులకెక్కింది. మరో బ్రాండ్ ‘ఇంద్రి సింగిల్ మాల్ట్ విస్కీ’.. అత్యధిక అవార్డులు పొందిన ట్రిపుల్ కాస్క్ సింగిల్ మాల్ట్‌గా నిలిచింది.

News January 12, 2025

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత.. రాష్ట్రంలో 1,673 ఉద్యోగాలు

image

TG: హైకోర్టు పరిధిలో 1,673 ఉద్యోగాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కోర్టుల్లో జూనియర్, ఫీల్డ్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 1,277, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ వంటి టెక్నికల్ పోస్టులు 184, హైకోర్టులో 212 ఉద్యోగాలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <>https://tshc.gov.in/<<>> సైట్‌ను సంప్రదించగలరు.