News February 9, 2025
మోదీ తిరిగి వచ్చాకే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం!

27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దక్కించుకున్న BJP సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఈ వేడుక PM మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాకే ఉండనుంది. రేపు పారిస్ వెళ్లనున్న మోదీ అక్కడ జరిగే AI సదస్సులో పాల్గొంటారు. అనంతరం 12, 13న USలో పర్యటిస్తారు. అమెరికా నుంచి ఆయన తిరిగి రాగానే 13 తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు BJP ప్లాన్ చేస్తోంది.
Similar News
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 24, 2025
IIT ధన్‌బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నం.46 ప్రకారం 50% క్యాప్‌తో రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో SC, STల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల BCల రిజర్వు స్థానాలు మారాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సైతం ఈ వివరాలు పంపింది.


