News February 13, 2025
16న ఢిల్లీ సీఎం ఎంపిక?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739439851990_695-normal-WIFI.webp)
UP, MP, రాజస్థాన్ తరహాలోనే ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను ఢిల్లీలో అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నెల 16న శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుచేసిన అధిష్ఠానం అదే రోజున సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. రేసులో కేజ్రీవాల్ను ఓడించిన పర్వేశ్ వర్మతో పాటు విజయేందర్, ఆశిష్ సూద్, పవన్ శర్మ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 చోట్ల బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Similar News
News February 13, 2025
RECORD: 82 లీటర్ల పాలు ఇచ్చిన ఆవు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739447011267_746-normal-WIFI.webp)
సాధారణంగా ఒక్క ఆవు మహా అంటే 5 నుంచి 10 లీటర్ల పాలు ఇస్తుంటుంది. కానీ, పంజాబ్కు చెందిన ఓ ఆవు ఏకంగా 82 లీటర్ల పాలను ఉత్పత్తి చేసి జాతీయ రికార్డు సృష్టించింది. లూథియానాలోని 18వ అంతర్జాతీయ PDFA డైరీ & అగ్రి ఎక్స్పోలో హోల్స్టెయిన్ ఫ్రైసియన్ జాతి ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఉత్పత్తి చేసి ఆశ్చర్యపరిచింది. ఇది పంజాబ్ పశువుల పెంపకం, వాటి పాల సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
News February 13, 2025
తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739448171412_81-normal-WIFI.webp)
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదని ఆమె స్పష్టం చేశారు.
News February 13, 2025
ముగ్గురు పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. ఐసీసీ చర్యలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739447150055_695-normal-WIFI.webp)
ముక్కోణపు వన్డే(PAK-NZ-SA) సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించారు. దీంతో ICC కొరడా ఝుళిపించింది. SA బ్యాటర్ మాథ్యూను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న షాహీన్ అఫ్రీదికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టింది. అలాగే కెప్టెన్ బవుమాను రనౌట్ చేసిన తర్వాత సౌద్ షకీల్, కమ్రాన్ గెటౌట్ అంటూ రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఐసీసీ వారిద్దరి ఫీజులో 10 శాతం కట్ చేసింది.