News February 18, 2025
రేపు ఢిల్లీ సీఎం ఎంపిక, ఎల్లుండి ప్రమాణం

ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారంలో బీజేపీ స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 20న సా.4.30 గం.కు కాకుండా ఉ.11.30 గం.కు రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. రేపు మ.3.30 గం.కు బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై సీఎం పేరును ఖరారు చేయనుంది. రేసులో పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్ తదితరులు ఉన్నారు.
Similar News
News November 16, 2025
ఫర్నిచర్ కొనేటప్పుడు ఈ పొరపాట్లు చేయొద్దు

ఆఫర్ ఉందనో, డిజైన్ నచ్చిందనో తొందరపడి ఫర్నిచర్ కొనుగోలు చేయకూడదని సూచిస్తున్నారు నిపుణులు. నిజంగా మీకు ఆ వస్తువు అవసరం ఉందో, లేదో.. ఆలోచించండి. తక్కువ ధరకు దొరుకుతుందని నాణ్యతను పట్టించుకోకపోతే నష్టపోతారు. నాణ్యతే ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలి. ట్రెండ్‌ను ఫాలో అవుతూ కొనుగోలు చేయొద్దు. అది ఎప్పుటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి.. చూడటానికి ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా ఉండేవి ఎంచుకోవడం మంచిది.
News November 16, 2025
3Dలోనూ అఖండ-2

బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తోన్న అఖండ-2 సినిమాను 3Dలోనూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్లోనూ తీసుకొస్తున్నట్లు బోయపాటి చెప్పారు. ‘ఈ చిత్రం దేశ ఆత్మ, పరమాత్మ. సనాతన ధర్మం ఆధారంగా మూవీని రూపొందించాం. ఈ సినిమాను దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ముంబై నుంచి ప్రచారం ప్రారంభించాం’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
అంబేడ్కర్ ప్రసంగం కంఠోపాఠం కావాలి: సీజేఐ

AP: రాజ్యాంగాన్ని దేశానికి అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం లాయర్లకు కంఠోపాఠం కావాలని CJI జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా మంగళగిరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఓ స్థిరపత్రంగా చూడకుండా సవరణ విధానాలనూ పొందుపరిచారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కునూ కల్పించారు’ అని పేర్కొన్నారు.


