News August 25, 2025
ఢిల్లీ సీఎంకి Z సెక్యూరిటీ ఉపసంహరణ

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కేటాయించిన CRPF Z కేటగిరీ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆమె భద్రతను ఎప్పటిలాగే ఢిల్లీ పోలీసులు చూసుకోనున్నారు. ఇటీవల CM రేఖపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన నేపథ్యంలో కేంద్రం CRPF Z కేటగిరీ భద్రతను అందించింది. తాజాగా వెనక్కి తీసుకుంది. CMపై <<17509535>>దాడి కేసులో<<>> ఇప్పటివరకు ప్రధాన నిందితుడు రాజేశ్ సక్రియాతో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
Similar News
News August 25, 2025
కేటీఆర్.. అప్పుడు మీ దమ్ముకు ఏమైంది?: MP కిరణ్

TG: పార్టీ మారిన MLAలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అంటూ KTR విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ MP చామల కిరణ్ కౌంటరిచ్చారు. ‘పదేళ్లలో 60 మంది MLAలు పార్టీ మారితే అప్పుడు మీ దమ్ముకు దుమ్ము పట్టిందా? మీరు HYDలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలిచినా పార్లమెంట్‌లో సున్నా వచ్చింది’ అని అన్నారు. BJPని విమర్శిస్తూ ‘కేంద్రం చంద్రబాబుకు ఇచ్చే ఇంపార్టెన్స్ BJP MPలకు ఇవ్వడం లేదు’ అని వ్యాఖ్యానించారు.
News August 25, 2025
మెగా DSC.. రేపటి నుంచి కాల్ లెటర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం

AP: డీఎస్సీ అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా రేపు(26.08.2025) మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మెగా DSC కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. తమకు కేటాయించిన రోజు అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేసి, మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థిని CV కోసం పిలుస్తామని వెల్లడించారు.
News August 25, 2025
TG PECET అడ్మిషన్ల సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల

TG PECET-2025 (B.P.Ed, D.P.Ed ) అడ్మిషన్లకు సంబంధించి సెకండ్ (ఫైనల్) ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26 నుంచి 29 వరకు ఆన్‌లైన్ <