News September 29, 2024
పురావస్తు శాఖపై ఢిల్లీ హైకోర్టు ఫైర్
ఢిల్లీలోని జామా మసీదును రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించకూడదన్న సంబంధిత ఫైల్‌ను సమర్పించడంలో పురావస్తు శాఖ విఫలమైందని ఢిల్లీ హైకోర్టు మండిపడింది. మసీదును ASI పరిధిలోకి తెస్తే ప్రభుత్వ పర్యవేక్షణ అధికమవుతుంది. దీంతో అలాంటి నిర్ణయం తీసుకోబోమని నాటి ప్రధాని మన్మోహన్ 2004లో షాహీ ఇమామ్‌కు హామీ ఇచ్చారు. దీన్ని ASI కూడా అంగీకరించింది. అయితే, సంబంధిత పత్రాలను సమర్పించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.
Similar News
News November 16, 2024
ISRO-SpaceX ప్రయోగం.. త్వరలో విమానాల్లో ఇంటర్నెట్ సేవలు
అంతరిక్ష ప్రయోగాల్లో ISRO-SpaceX మొదటి సారి చేతులు కలిపాయి. ఇస్రో కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-N2 ఉపగ్రహాన్ని ఫాల్కన్-9 రాకెట్ ద్వారా వచ్చే వారం ప్రయోగించనున్నారు. 3000 మీటర్ల ఎత్తులో ఉన్న విమానాల్లో సైతం ఇంటర్నెట్ సేవల్ని అందించడానికి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. GSLV Mk3 రాకెట్ 4 వేల KGల బరువును మోయగలదు. GSAT-N2 4700 KGలు ఉండడంతో SpaceXతో ఇస్రో జట్టుకట్టింది.
News November 16, 2024
‘కంగువా’ కలెక్షన్లు ఎంతంటే?
సూర్య, శివ కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడికల్ ఫాంటసీ ఫిల్మ్ ‘కంగువా’. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.89.32 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని పేర్కొంది.
News November 16, 2024
BREAKING: నటి కస్తూరి అరెస్ట్
తెలుగు వారిపై వివాదాస్పద <<14525601>>వ్యాఖ్యలు<<>> చేసిన నటి కస్తూరి అరెస్టయ్యారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించగా, హైదరాబాద్‌లో ఆచూకీ లభ్యమైంది. ఆమెను ప్రస్తుతం పోలీసులు చెన్నై తరలిస్తున్నారు.