News June 15, 2024
సునీత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో మాట్లాడుతున్న ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కోర్టు నోటీసులు పంపింది. ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఆ వీడియోలను తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను, మరో ఐదుగురికి కూడా ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News November 21, 2025
జాబ్ చేస్తున్నారా..? ఈ షిఫ్టు మహా డేంజర్!

ప్రస్తుతం కంపెనీని బట్టి డే, నైట్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటున్నాయి. అయితే దీర్ఘకాలిక ఆరోగ్యంపై షిఫ్ట్ డ్యూటీల ప్రభావాన్ని పరిశీలిస్తే.. డే షిఫ్టులు సురక్షితమైనవని వైద్యులు చెబుతున్నారు. అదే రొటేషనల్ షిఫ్టులు ప్రమాదకరమని, షెడ్యూల్ తరచూ మారితే శరీరం సర్దుబాటు చేసుకోలేదని హెచ్చరించారు. దీనివల్ల నిద్రలేమి, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీంతో పోల్చితే నైట్ షిఫ్ట్ కాస్త బెటర్ అంటున్నారు.
News November 21, 2025
iBOMMA రవి విచారణలో కీలక విషయాలు

iBOMMA రవి రెండో రోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. తమిళ, హిందీ వెబ్సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసిన రవి క్రిప్టో ద్వారా పేమెంట్ చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్స్‌కు గేట్వేగా ఉపయోగించి వచ్చిన డబ్బులతో సినిమాలు కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. కరీబియన్ దీవుల్లో ఆఫీసు ఏర్పాటు చేసి, 20 మందితో కంటెంట్‌ను అప్లోడ్ చేయిస్తున్నట్లు తేల్చారు.