News October 5, 2025

ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ: IQAir

image

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచినట్లు వాయు నాణ్యతను ట్రాక్ చేసే అంతర్జాతీయ సంస్థ ‘IQAir’ వెల్లడించింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) స్థాయులు ప్రమాదకరంగా పెరిగినట్లు వెల్లడించింది. ఇవాళ ఏకంగా AQI 167గా ఉందని హెచ్చరించింది. దీనివల్ల పొగమంచు ఏర్పడి ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా కష్టంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే శీతాకాలంలో ఇలాంటి పరిస్థితులను ఢిల్లీలో చూస్తుంటాం.

Similar News

News October 5, 2025

118 APP పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(APP) పోస్టులకు <>దరఖాస్తు<<>> గడువును TSLPRB పొడిగించింది. ఇవాళ్టితో గడువు ముగియనుండగా ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఈ పోస్టులకు 7,183 మంది రిజిస్టర్ చేసుకోగా ఇవాళ మధ్యాహ్నం వరకు 2,193 అప్లై చేసుకున్నట్లు తెలిపింది. వరుస సెలవుల కారణంగా గడువు పొడిగిస్తూ TSLPRB ప్రకటన విడుదల చేసింది.

News October 5, 2025

అమ్మ అవ్వాలనుకుంటే ఇలా సిద్ధంకండి

image

మాతృత్వం అనేది ఒక వరం. దీనికోసం ముందుగా శరీరాన్ని సిద్ధం చేసుకోవాలని, లేదంటే పుట్టే బిడ్డ పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఆహారంలో ఫోలిక్ యాసిడ్, మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ చేర్చుకోవాలి. అన్ని రకాల కూరగాయలు, పండ్లు, నట్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ డైట్‌లో ఉండేలా చూడాలి. ఆలివ్ ఆయిల్‌ను వాడితే గర్భాశయానికి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది’ అని చెబుతున్నారు.

News October 5, 2025

ఇతిహాసాలు క్విజ్ – 26 సమాధానాలు

image

1. రాముడు సూర్య వంశానికి చెందినవాడు.
2. ఉత్తర, అభిమన్యుల కుమారుడు ‘పరీక్షిత్తు’.
3. విష్ణువు కాపలాదారులు జయవిజయులు.
4. కార్తికేయ స్వామికి 6 తలలుంటాయి.
5. హనుమాన్ చాలీసాను తులసీదాస్ రచించారు.
<<-se>>#IthihasaluQuiz<<>>