News November 17, 2024

ఢిల్లీ మంత్రి రాజీనామా

image

ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీలో సీనియర్. అరవింద్ కేజ్రీవాల్ తరువాత ముఖ్యమంత్రి పదవి ఈయనకే వస్తుందనే ప్రచారం కూడా జరిగింది.

Similar News

News November 4, 2025

ఓల్డ్ బ్యాంకు అకౌంట్‌లో డబ్బు ఫ్రీజ్ అయిందా?

image

మీ కుటుంబసభ్యులు తమ బ్యాంకు అకౌంట్లలో డబ్బు ఉంచి మర్చిపోయారా? పదేళ్ల కంటే ఎక్కువ సమయం కావడంతో అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారా? అలా ఫ్రీజ్ చేసిన డబ్బును RBI తన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. వీటిని తిరిగి పొందవచ్చు. udgam.rbi.org.inలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తనిఖీ చేయొచ్చు. బ్యాంకుకు వెళ్లి KYC సమర్పించి డబ్బును తిరిగి పొందొచ్చు. SHARE IT

News November 4, 2025

BELలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>), పంచకులలో 10 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-C పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, ఇంటర్+ITI+అప్రెంటిషిప్ సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://bel-india.in/

News November 4, 2025

అష్టైశ్వర్యాలు అంటే ఏంటి?

image

పెద్దలు మనల్ని దీవించేటప్పుడు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని అంటారు. మరి ఆ అష్టైశ్వర్యాలేంటో మీరెప్పుడైనా ఆలోచించారా? ఐశ్వర్యం అంటే సంపద. అష్ట అంటే 8. అందుకే అష్టైశ్వర్యాలంటే డబ్బే అనుకుంటారు. కానీ, కాదు. రాజ్యం, ధనం, ఇల్లాలు, సంతానం, ధైర్యం, ఆత్మస్థైర్యం, విద్య, వినయం.. ఇవే 8 ఐశ్వర్యాలు. మన జీవితం ఆనందంగా ఉండాలంటే కావాల్సినవి ఇవే. డబ్బు కాదు. అందుకే ఇవి కలగాలని పెద్దలు మనల్ని అలా జీవిస్తారు.