News June 4, 2024
యూపీని గెలిచినోడికే ‘ఢిల్లీ’ పీఠం

అతి పెద్ద బ్యాటిల్ గ్రౌండులో ఆరితేరినవాడే విజేతగా ఆవిర్భవిస్తాడు. లోక్సభ ఎన్నికల్లోనూ అంతే. అత్యధిక సీట్లున్న యూపీని ఒడిసిపడితేనే పార్లమెంటులో జయకేతనం ఎగరేస్తారు. నరేంద్ర మోదీ, అమిత్షాకు ఇది బాగా తెలుసు. అందుకే ఈ జోడీ అంతలా శ్రద్ధపెట్టింది. కుల, మత, వర్గ సమీకరణాలతో పాటు సంక్షేమం, శాంతి భద్రతలకు పెద్దపీట వేశారు. అందుకే ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏకు 80కి 70+ సీట్లు వస్తాయని అంచనా.
Similar News
News December 1, 2025
పెద్దపల్లి: ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సిరి ఫంక్షన్ హాల్ వరకు ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డా.వి.వాణిశ్రీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో డ్రగ్స్ వినియోగం, అసురక్షిత లైంగిక చర్యలు, వాడిన సిరంజిల వల్ల ఎచ్.ఐ.వి. వ్యాప్తి ప్రమాదం పెరుగుతోందని ఆమె చెప్పారు. యువతలో అవగాహన పెంపు అత్యవసరమని సూచించారు.
News December 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 1, 2025
వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.


