News February 16, 2025
ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది: PM మోదీ

ఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘సన్నిహితుల్ని కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని తెలిపారు.
Similar News
News February 19, 2025
మిర్చి రైతులపై జగన్‌వి పచ్చి అబద్దాలు: అచ్చెన్నాయుడు

AP: గుంటూరు మిర్చి యార్డులో మాజీ CM జగన్ పచ్చి అబద్దాలు ఆడారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆయనను చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘జగన్ తన పాలనలో రైతుల కోసం ఒక్క మంచి పని చేయలేదు. ఆయన హయాంలో రైతుల నుంచి ఒక్క గింజా కొనలేదు. డ్రిప్పులు అందించలేదు. ప్రకృతి విపత్తుల సమయంలో ఒక్క పైసా ఇవ్వలేదు. మేం వచ్చి 6 నెలలు కాకముందే గగ్గోలు పెడుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.
News February 19, 2025
PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

పీఎం కిసాన్ 19వ విడత కింద రైతుల ఖాతాల్లో రూ.2000లను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న జమ చేయనుంది. ఏటా రూ.6000 3 విడతల్లో జమ చేసే ఈ పథకం డబ్బులు పొందాలంటే రైతులు ఈ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఈ నెల 24లోపు E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి. ఇక్కడ <
News February 19, 2025
జగన్‌కు ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు: కేంద్ర మంత్రి పెమ్మసాని

AP: వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ఆ 11 సీట్లు కూడా రావని, ఒక్క సీటుకే పరిమితమవుతారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ‘జగన్ భాష, వ్యవహారంతో వైసీపీకి కష్టాలు తప్పవు. ఆయన హయాంలో YCP నేతలతో చేయకూడని పనులు చేయించారు. వాటిపైనే ఇప్పుడు వారిపై కేసులు పెడుతున్నారు. ఇందులో తప్పేముంది? రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సీఎం చంద్రబాబు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.