News February 8, 2025
ఢిల్లీ ఫలితాలు.. కాంగ్రెస్ సమాధిపై మరో రాయి: సత్య కుమార్
AP: PM మోదీ పట్ల ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి ఢిల్లీ ఎన్నికల్లో BJP అఖండ విజయమే నిదర్శనమని మంత్రి సత్యకుమార్ అన్నారు. కేజ్రీవాల్‌తో సహా ఆప్ ముఖ్య నేతలను ఓడించి ప్రజాధనాన్ని దోచుకునే వారిని క్షమించబోమని స్పష్టమైన తీర్పు ఇచ్చారని ట్వీట్ చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అందలం ఎక్కించి.. అవినీతి, అబద్ధాలకు గుణపాఠం నేర్పారని తెలిపారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్ సమాధిపై మరో రాయిని పేర్చారని ఎద్దేవా చేశారు.
Similar News
News February 8, 2025
SA20: సన్ రైజర్స్ హ్యాట్రిక్ కొడుతుందా?
సౌతాఫ్రికా లీగ్ 20 తుది అంకానికి చేరింది. కావ్య మారన్‌కు చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ నేడు టైటిల్ కోసం తలపడనున్నాయి. రషీద్ సారథ్యంలోని కేప్ టౌన్ టైటిల్‌పై కన్నేయగా ఈస్టర్న్ కేప్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌తో పాటు డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది.
News February 8, 2025
కేసీఆర్‌ను కలిసిన వారంతా ఓటమి: కాంగ్రెస్
ఢిల్లీలో బీజేపీ గెలవడంతో రాహుల్ గాంధీని అభినందిస్తూ KTR చేసిన సెటైరికల్ ట్వీట్‌కు కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ BRS చీఫ్ KCRను కలవడం వల్లే ఓడిపోయారని ట్వీట్స్ చేస్తున్నారు. ‘మనం చెయ్యి కలిపితే మామూలుగా లేదుగా. YS జగన్, నవీన్ పట్నాయక్, థాక్రే, కేజ్రీవాల్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ మరోసారి సున్నా సీట్లు గెలిచిందని BRS శ్రేణులూ రీకౌంటరిస్తున్నాయి.
News February 8, 2025
ఇవాళ ‘పుష్ప-2’ థాంక్యూ మీట్
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ టాప్ ప్లేస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఇవాళ ‘థాంక్యూ మీట్’ నిర్వహించనున్నట్లు మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.