News December 19, 2024

ఢిల్లీ టు కేరళ రూ.22,000, ఢిల్లీ టు దుబాయ్ రూ.21,000!

image

ఢిల్లీ నుంచి కన్నూర్ (కేరళ)కు డిసెంబర్ 22న ఇండిగో ఫ్లైట్ టికెట్ ధర రూ.22,000 చూపించడంతో సోషల్ మీడియాలో టికెట్ ఫేర్లపై చర్చ జరుగుతోంది. దీని కంటే ఢిల్లీ నుంచి దుబాయ్ టికెట్ ధర రూ.21000 చూపిస్తోందని పోస్టులు చేస్తున్నారు. అయితే తక్కువ సమయంలో బుక్ చేసుకోవడం, క్రిస్మస్ సందర్భంగా ధరలు పెరిగి ఉంటాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీకూ ఇలాంటి అనుభవం ఎదురైందా?

Similar News

News November 24, 2025

పంటల్లో బోరాన్ లోపాన్ని ఎలా సవరించాలి?

image

ఇసుక, సున్నం, చౌడు నేలల్లో బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తోంది. భూసార పరీక్షలతో బోరాన్ లోపం గుర్తించే నేలల్లో 4 కిలోల బోరోక్స్‌ను ఎకరానికి దుక్కిలో వేసి కలియదున్నాలి. సేంద్రీయ ఎరువులను వాడాలి. పంటల్లో బోరాన్ లోపం గమనిస్తే 1 గ్రా. బోరాక్స్‌ను లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. వాణిజ్య పంటల్లో 1% బోరాక్స్ ద్రావణాన్ని మొలకెత్తిన 30, 45, 60, 90 రోజుల్లో పిచికారీ చేయాలి.

News November 24, 2025

పిల్లలకి ఘనాహారం ఎలా అలవాటు చెయ్యాలంటే?

image

చిన్నారులకు 6నెలలు దాటిన తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్‌ రాగి మాల్ట్, ఉగ్గు వంటివి స్టార్ట్ చెయ్యాలి. నెమ్మదిగా బ్రకోలీ, చిక్కుళ్లు, బీన్స్, బీరకాయ, క్యారెట్, బీట్‌రూట్ ఆవిరిపై ఉడికించి వారికి తినిపించాలి. అప్పుడే వారి శరీరం భిన్నరకాల ఆహారాలకు అలవాటవుతుంది. పోషకాలూ అందుతాయి. చాలామంది పేరెంట్స్ ఇడ్లీ, రసం, పెరుగన్నం త్వరగా తింటున్నారని అవే పెడతారు. దీంతో ఎదుగుదలలో ఇబ్బందులు వస్తాయంటున్నారు నిపుణులు.

News November 24, 2025

కీలక తీర్పుల్లో సూర్యకాంత్‌ ముద్ర

image

53వ CJIగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ సూర్యకాంత్‌ అనేక కీలక తీర్పుల్లో భాగస్వామ్యం అయ్యారు. జమ్మూకశ్మీర్‌ ఆర్టికల్‌ 370 రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం వంటి ప్రధాన అంశాలపై ఆయన సభ్యుడిగా ఉన్న ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు విశేషంగా నిలిచాయి. దేశద్రోహ చట్టాన్ని నిలిపివేసిన ధర్మాసనంలో కూడా సభ్యుడు. ఈ చట్టం కింద కొత్త FIRలు నమోదు చేయొద్దని ఆదేశించారు.