News March 31, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పృథ్వీషా రీఎంట్రీ ఇస్తున్నారు.
జట్లు: CSK: రుతురాజ్ (C), రచిన్ రవీంద్ర, రహానే, మిచెల్, జడేజా, సమీర్ రిజ్వీ, ధోనీ(w), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్, పతిరణ.
DC: వార్నర్, మార్ష్, పృథ్వీ షా, పంత్ (C), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, ఇషాంత్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్, ముకేశ్.
Similar News
News March 30, 2026
వాహనదారులకు షాక్.. పెరిగిన CNG ధర

TG: CNG వాహనదారులకు షాక్ తగిలింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దిగుమతికి ఆటంకంతో సరఫరా మరింత తగ్గింది. ఇదే సాకుతో గ్యాస్ కంపెనీలు ధరలు పెంచేస్తున్నాయి. 3 రోజుల క్రితం వరకు కిలోపై అదనంగా ₹1 చొప్పున వసూలు చేసిన HYDలోని ఓ PVT గ్యాస్ కంపెనీ ఆ తరువాత నుంచి మరో రూ.2 పెంచి విక్రయిస్తోంది. వారం కిందట ఈ ధర ₹96గా ఉండగా శనివారం నుంచి అన్ని బంకుల్లో KG ₹99 చొప్పున CNG స్టేషన్లలో వసూలు చేస్తున్నారు.
News March 30, 2026
1,100 సార్లు బాంబు బెదిరింపులు.. మొత్తానికి దొరికాడు!

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మైసూరులో శ్రీనివాస్ లూయిస్(47)ను అదుపులోకి తీసుకున్నారు. స్కూళ్లు, హైకోర్టులు, ప్రభుత్వ బిల్డింగుల్లో బాంబులు పెట్టినట్లు 1,100కు పైగా బెదిరింపు మెయిల్స్ పంపాడని అధికారులు తెలిపారు. అతడు పీజీ చదివిన నిరుద్యోగి అని, మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు ప్రాథమికంగా తెలిసిందని పేర్కొన్నారు.
News March 30, 2026
AIFF చీఫ్ వేధించారు: మాజీ సీఎం కూతురు

ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(AIFF) చీఫ్ కళ్యాణ్ చౌబే తనను వేధించారని మహిళా అధికారి వాలంకా అలెమావో ఆరోపించారు. మార్చి 29న జరిగిన AIFF ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చౌబే, ఇతర అధికారులు హేళన చేసి వేధించారని ఫిర్యాదు చేశారు. ‘నాపై అనవసర, అగౌరవకర వ్యాఖ్యలు చేశారు. నన్ను భయపెట్టేందుకు హద్దులు దాటి మాట్లాడారు’ అని పేర్కొన్నారు. గోవా Ex CM చర్చిల్ అలెమావో కూతురైన వాలంకా AIFF మహిళా కమిటీ చీఫ్‌గా ఉన్నారు.


